Umapathi Movie: పల్లెటూరి అమ్మాయిగా అవికా గోర్.. డిసెంబర్ 29న థియేటర్లలోకి 'ఉమాపతి'

Umapathi Movie Release Date: పల్లెటూరు అమ్మాయిగా అలరించేందుకు అవికా గోర్ రెడీ అవుతోంది. విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఉమాపతి మూవీ ఈ నెల 29న ఆడియన్స్‌ ముందుకు రానుంది.  

Last Updated : Dec 25, 2023, 02:35 PM IST
Umapathi Movie: పల్లెటూరి అమ్మాయిగా అవికా గోర్.. డిసెంబర్ 29న థియేటర్లలోకి 'ఉమాపతి'

Umapathi Movie Release Date: ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మించగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ సైతం అందరినీ ఆకట్టుకుంది.

ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు.పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన ప్రేమ కథా చిత్రమని కొనియాడారు. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. డిసెంబర్ 29న థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉంది.

ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతంది. 

 

నటీనటులు
అనురాగ్, అవికా గోర్, పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు

టెక్నీకల్ టీమ్ 
నిర్మాత: కె. కోటేశ్వరరావు
దర్శకత్వం: సత్య ద్వారపూడి 
కెమెరా మెన్: రాఘవేంద్ర 
సంగీతం: శక్తికాంత్ కార్తిక్ 
నేపథ్య సంగీతం : జీవన్ బాబు
ఎడిటింగ్: గౌతమ్ రాజు, నాని
లిరిక్స్ : చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కరభట్ల
ఆర్ట్ : వెంకట్ ఆరే
పీఆర్ఓ: సాయి సతీష్, రాంబాబు

 

Trending News