Weight Loss Tips: రోటీ తింటే బరువు తగ్గుతారా లేదా?.. డైటీషియన్స్ ఏం చెపున్నారంటే!

Weight Loss Tips, Roti is best Weight Loss or Not. డైటింగ్‌లో రోటీ తినాలా వద్దా అనే సందేహం కూడా అందరిలోనూ ఉంటుంది. మీరు కూడా ఈ గందరగోళంలో ఉన్నట్లయితే ఈ ఆర్టికల్ చదవండి.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 29, 2022, 02:42 PM IST
  • రోటీ తింటే బరువు తగ్గుతారా లేదా?
  • డైటీషియన్స్ ఏం చెపున్నారంటే!
  • కూరగాయలు, సలాడ్‌ని కూడా
Weight Loss Tips: రోటీ తింటే బరువు తగ్గుతారా లేదా?.. డైటీషియన్స్ ఏం చెపున్నారంటే!

Roti Or Bread For Weight Loss: ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగం, వ్యాపారం కారణంగా.. సమయానికి తినకపోవడం, బయటి ఫుడ్‌కి ఎక్కువ అలవాటు పడ్డారు. దాంతో చాలా మంది స్థూలకాయులుగా తయారవుతున్నారు. అధిక బరువు తగ్గేందుకు ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ డైట్‌లో ఏం తినాలి, ఏది తినకూడదు అనే ప్రశ్న చాలామంది మదిలో ఎప్పుడూ మెదులుతుంటుంది. ఇక డైటింగ్‌లో రోటీ తినాలా వద్దా అనే సందేహం కూడా అందరిలోనూ ఉంటుంది. మీరు కూడా ఈ గందరగోళంలో ఉన్నట్లయితే.. డైట్‌లో రోటీ గురించి డైటీషియన్ అభిప్రాయం ఏమిటో ఓసారి చూద్దాం.

రోటీ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో డైటీషియన్ మరియు న్యూట్రిషనిస్ట్ రిచా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో రోటీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు. బరువు తగ్గాలనుకునే వారికి రోటీ ఉత్తమ ఎంపిక అని ఆమె పేర్కొన్నారు. రోటీ తక్కువ కేలరీల ఆహారం అని న్యూట్రిషనిస్ట్ రిచా చెప్పారు. 

న్యూట్రిషనిస్ట్ రిచా ప్రకారం... మీడియం సైజ్ రోటీ బరువు 40 గ్రాములు మరియు 120 కేలరీలుతో ఉంటుంది. క్యాలరీలు అధికంగా ఉండే  బ్రెడ్ తినడం నివారించాలి. బ్రెడ్‌లో విటమిన్ B1 ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ మరియు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. మల్టీగ్రెయిన్ రోటీని తింటే.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని పెంచదు. అందుకే డయాబెటిక్ రోగులు మల్టీగ్రెయిన్ రోటీని తినవచ్చు.

పురుషులకు రోజుకు 1700 కేలరీలు అవసరమవుతాయి. కాబట్టి పురుషులు లంచ్ మరియు డిన్నర్‌లో మూడు రోటీలు తినవచ్చు. అదే సమయంలో మహిళలకు రోజుకు 1400 కేలరీలు అవసరం. మహిళలు లంచ్ మరియు డిన్నర్‌లో రెండు రోటీలు తినవచ్చు. అంతే కాకుండా కూరగాయలు, సలాడ్‌ని కూడా రోటీతో తీసుకోవాలి.

Also Read: విడాకులు తీసుకున్న సానియా, షోయబ్.. ఆ ఒక్క కారణంగానే ఆగారు! అధికారిక ప్రకటన ఎప్పుడంటే

Also Read: Sabarimala Income 2022: శబరిమల అయ్యప్ప ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం.. కేవలం 10 రోజుల్లోనే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News