Orange Juice: ఆరెంజ్‌ జ్యూస్‌ ఎలా తయారు చేసుకోవాలి.. దీని లాభాలు ఎంటి?

Orange Juice Benefits: ఆరెంజ్‌ జ్యూస్‌ని వేసవిలో తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2024, 10:33 PM IST
Orange Juice: ఆరెంజ్‌ జ్యూస్‌ ఎలా తయారు చేసుకోవాలి.. దీని లాభాలు ఎంటి?

Orange Juice Benefits: ఆరెంజ్‌ జ్యూస్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో ఈ పండ్లతో తయారు చేసిన  జ్యూస్‌లను తీసుకోవడం వల్ల శరీరం ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరెంజ్‌లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. విటమిన్‌ సి ఆరెంజ్‌ పండులో లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజన్ల్‌ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఆరెంజ్‌ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాని కాపాడుతుంది. 
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆరెంజ్‌ పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 

జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఆరెంజ్‌ పండు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఈ పండు చర్మ సమస్యలను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల ముడతలు తొలుగుతాయి.  పండును నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు జ్యూస్‌గా తయారు చేసుకొని తినవచ్చు. దీని తయారు  చేసుకోవడం ఎంతో సులభం. మీరు వేసవిలో బయట డ్రింక్స్‌ కంటే ఈ పండుతో తయారు చేసే జ్యూస్‌ను తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఆరెంజ్‌ జ్యూస్‌ తయారీ విధానం 

కావలసిన పదార్థాలు 

* 2-3 నారింజాలు 
* చక్కెర 
* నీరు 

తయారీ విధానం 

1. నారింజాలను శుభ్రంగా కడగండి. 

2. పండ్లను సగానికి కోసి, రసం పిండండి. 

3. రుచి చూసి, కావాలంటే చక్కెర లేదా నీరు కలుపుకోండి.

4. బాగా కలపి, వడపోసి సర్వ్ చేయండి.

చిట్కా 

* నూతన నారింజాలతో తయారు చేస్తే రసం మరింత రుచిగా ఉంటుంది. 

* చక్కెరకు బదులుగా తేనెను కూడా వాడవచ్చు. 

* ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా తాజాగా తాగడమే మంచిది. 

ఈ విధంగా ఈ జ్యూస్‌ను తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే  పిల్లలు ఆరెంజ్‌ తీసుకోవడం వల్ల వారిలో ఆకలి, ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా , ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడుకుండా, సీజన్ల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. దీని పైన చెప్పిన విధంగా జ్యూస్‌ తయారు చేసుకొని తాగవచ్చు. మీరు కూడా ఈ జ్యూస్‌ని ఇంట్లోనే తయారు చేసుకొని తాగవచ్చు. దీని కోసం ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎంతో సులభంగా ఇంట్లో లభించే వస్తువులతో ఈ జ్యూస్‌ తయారు చేసుకోవచ్చు.

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News