Detox Drinks Benefits: శరీరంలో వ్యర్థాలను, మలినాలను తొలగించుకునేందుకు ఈ డ్రింక్స్ తాగండి!

Detox Drinks Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో డిటాక్స్ డ్రింక్ తాగితే శరీరంలో పేరుకుపోయిన మురికి, మలినాలు తొలగిపోతాయి. దీంతో పాటు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ క్రమంలో డిటాక్స్ ఎలా తయారు చేసుకోవాలి. వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 12:48 PM IST
Detox Drinks Benefits: శరీరంలో వ్యర్థాలను, మలినాలను తొలగించుకునేందుకు ఈ డ్రింక్స్ తాగండి!

Detox Drinks Benefits: మారుతున్న జీవనశైలి, ఆహరపు అలవాట్లు కారణంగా కాలానుగుణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉబకాయం, అధిక రక్తపోటు, అజీర్ణ వంటి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు డిటాక్సిఫై చేయించుకోవడం చాలా ముఖ్యం. అంటే కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం సహా మలినాలను శుభ్రం చేసేందుకు డిటాక్స్ పానీయాలను తాగుతుంటారు. 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డిటాక్స్ డ్రింక్ తాగితే శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకునెట్టివేస్తుంది. దీని ద్వారా శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఈ డిటాక్స్ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 

దాల్చిన చెక్క, తేనె తో డిటాక్స్

దాల్చిన చెక్క, తేనె కలిపిన పానీయం శరీరంలోని మలినాలను శుభ్రం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ డిటాక్స్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అవి శరీరంలోని మురికిని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అదే సమయంలో, తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కలయిక మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. 

పుదీనా, దోసకాయ డిటాక్స్

పుదీనా, దోసకాయతో చేసిన డిటాక్స్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేస్తుంది. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అందువల్ల వేసవిలో ఈ డిటాక్స్ తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి బయటపడొచ్చు. మరోవైపు పుదీనా ఆకులు వివిధ రకాల యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. 

(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Sugarcane Juice: డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Also Read: Milk Side Effects: మీరు అతిగా పాలు తాగుతున్నారా? అయితే మీకు ఇదో హెచ్చరిక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News