Diabetes Control: డయాబెటిస్ నియంత్రణకు డైట్‌లో ఈ తృణధాన్యాలు చేర్చి చూడండి

Diabetes Control: తృణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. డైట్‌లో తృణధాన్యాల్ని చేర్చుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణకు ఏం తినాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2023, 02:14 PM IST
Diabetes Control: డయాబెటిస్ నియంత్రణకు డైట్‌లో ఈ తృణధాన్యాలు చేర్చి చూడండి

డయాబెటిస్ వ్యాధి నియంత్రణకు డైట్ చాలా అవసరం. ఎందుకంటే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచుతుంటాయి. అందుకే డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు హై కార్బోహైడ్రేట్లు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ వస్తువులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేస్తుంటాయి. గోధుమల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే గోధుమలతో డయాబెటిస్ సమస్య పెరుగుతుంది. ఈ క్రమంలో గ్రైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే తృణధాన్యాలు తినాల్సి ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇవి చాలా ఉపయోగకరం. బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు ఏ విధమైన ధాన్యాల్ని తీసుకోవాలో తెలుసుకుందాం..

రాగి

రాగి ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. ఇవి షుగర్ నియంత్రించేందుకు దోహదపడుతాయి. రాగుల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. డయాబెటిస్ కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. రాగులతో ఇడ్లీ, రోటీ వంటి వస్తువుల్ని డైట్‌లో చేర్చుకోవల్సి ఉంటుంది. 

శెనగలు

డయాబెటిస్ వ్యాధికి శెనగలు చాలా మంచివి. శెనగల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. శెనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయి.

మిల్లెట్స్

మిల్లెట్స్‌లో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో మిల్లెట్స్ రొట్టె తినడం చాలా మంచిది. డయాబెటిస్‌కు మిల్లెట్స్ చాలా ప్రయోజనకరం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కావడంతో డయాబెటిస్ నియంత్రణకు దోహదమౌతుంది.

జొన్నలు

జొన్నల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులు జొన్నలు తినడం చాలా ప్రయోజనకరం. జొన్నల్లో విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.

బార్లీ

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు బార్లీ చాలా మంచిది. ఇందులో ఉండే మెగ్నీషియం, ప్రోటీన్లు బ్లడ్ షుగర్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. డయాబెటిస్ రోగులు సాధ్యమైనంతవరకూ బార్లీతో చేసిన పదార్ధాలు తీసుకుంటే మంచిది.

Also read: Sugar Free Habits: 30 రోజులు నో షుగర్ ఛాలెంజ్‌తో కలిగే 5 మార్పులివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News