Garlic Side Effects: వెల్లుల్లి ఎవరెవరు తినకూడదు, తింటే ఏమౌతుంది

Garlic Side Effects: వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఆయుర్వేదపరంగా కూడా వెల్లుల్లిలో అద్భుత ఔషధ గుణాలున్నాయి. అయితే కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లి తీసుకోకూడదు. లేకుంటే పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2023, 08:00 AM IST
Garlic Side Effects: వెల్లుల్లి ఎవరెవరు తినకూడదు, తింటే ఏమౌతుంది

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదన్నప్పుడు కొందరు మాత్రం తినకూడదనడంలో అర్ధమేంటనే ప్రశ్నలు రావచ్చు. కానీ నిజమే. వెల్లుల్లిలోని పోషక గుణాలు ఆరోగ్యానికి మేలు చేకూర్చినా..వెల్లుల్లి స్వభావ రీత్యా కొందరికి హాని కల్గిస్తుంది. ఆ జాగ్రత్తలు పాటించాల్సిందే.

వెల్లుల్లిని సాధారణంగా వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే వివిద రకాల పోషక గుణాల కారణంగా వెల్లుల్లిని ఔషధంగా కూడా పిలుస్తారు. చాలా రోగాల్ని వెల్లుల్లితో నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా వెల్లుల్లి మంచిదైనా స్వభావరీత్యా కొందరు వెల్లుల్లి పొరపాటున కూడా తినకూడదు. ఎందుకు, ఏంటనేది తెలుసుకుందాం.

వెల్లుల్లి ఎవరెవరికి మంచిది కాదు

ఎసిడిటీ

ఎసిడిటీ సమస్య అధికంగా ఉంటే వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. వెల్లుల్లికి పూర్తి దూరం పాటించాలి. ఎందుకంటే స్వభావరీత్యా వెల్లుల్లిలో ఎసిడిటీ గుణాలున్నందున ఆ సమస్య ఉన్నవాళ్లు తింటే ఛాతీలో మంట పుడుతుంది. ఎసిడిటీతో బాధపడేవాళ్లు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది. 

చెమట వాసన

చాలామందికి చెమటలో దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు వెల్లుల్లి తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్ అనేది ఎక్కువసేపు నోటి నుంచి దుర్వాసనకు కారణమౌతుంది. అటువంటప్పుడు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ సమస్య మరింత పెరుగుతుంది. 

గుండె మంట

వెల్లుల్లి రోజూ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. దాంతో గుండెలో మంట, కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. అంటే వెల్లుల్లి ఉపయోగం ఎప్పుడూ మోతాదు మించకూడదు. 

సర్జరీ

ఏదైనా సర్జరీ చేయించుకుని ఉంటే వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లి వల్ల సర్జరీ గాయంపై ప్రభావం పడుతుంది. సర్జరీకు 2-3 వారాల ముందే వెల్లుల్లి తినకూడదని వైద్యులు చెబుతుంటారు. లేకపోతే సర్జరీ వికటించే అవకాశాలున్నాయి.

Also read: Cholesterol Tips: కాకరకాయ టీ ఏంటని నోరెళ్లబెట్టవద్దు, కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుత ఔషధమిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News