Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు ప్రాణాంతకమౌతుంది, ఏం చేయాలి

Fatty Liver: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైంది. లివర్ వ్యాది తీవ్రమైతే ప్రాణాంతకం కావచ్చు కూడా. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2024, 03:47 PM IST
Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు ప్రాణాంతకమౌతుంది, ఏం చేయాలి

Fatty Liver: శరీరంలో లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే లివర్ వ్యాధి ఒక్కోసారి తీవ్రమై సిరోసిస్, కేన్సర్‌లా మారి ప్రాణాలు తీయవచ్చు. మరి లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవడం..

శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఇది వాస్తవానికి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మద్యపానం అతిగా తీసుకుంటే సంభవిస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇది. రెండవది చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తేది. స్థూలకాయం, డయాబెటిస్ వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇది నాన్ ఆల్కహాలిక్ లివర్ వ్యాధి. రక్తాన్ని శుద్ధి చేయడం, కొవ్వును మిగల్చడం, వ్యర్ధాల్ని బయటకు తొలగించడం వంటి ప్రక్రియల్లో లివర్ పాత్ర కీలకం. అందుకే లివర్ సమస్య ఏర్పడితే శరీరం పనితీరు మందగిస్తుంది. ఇతర సీరియస్ వ్యాధులు తలెత్తవచ్చు. క్రమంగా కేన్సర్, సిరోసిస్ హెమరేజ్ సమస్యలు ఉత్పన్నమౌతాయి. 

కాళ్లు, మడమల్లో వాపు ప్రధానంగా కన్పిస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా లివర్ దెబ్బతినడం వల్ల కాళ్లలే నీరు చేరిపోతుంది. ఫలితంగా స్వెల్లింగ్ కన్పిస్తుంది. ఇక అడ్వాన్స్ దశలో అయితే కడుపులో నీరు పేరుకుంటుంది. దాంతో కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. దీనినే సిరోసిస్ లేదా కేన్సర్ అని పరిగణిస్తారు. కాళ్లు మడమల్లో వాపుతో పాటు అరికాళ్లలో ఎడిమా సమస్య ఉంటుంది. 

ఫ్యాటీ లివర్ సమస్య, లక్షణాల్నించి రక్షించుకునేందుకు ముందుగా బరువు తగ్గించుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం పూర్తిగా తగ్గించాలి. ఉదాహరణకు వైట్ రైస్, బంగాళదుంప, వైట్ బ్రెడ్‌కు దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం పూర్తిగా మానేయాలి.

Also read: Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలున్నాయా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News