Heart Blockage: ఈ 10 ఫుడ్స్‌తో మీకు హార్ట్‌ బ్లాక్‌ సమస్యే ఉండదు.. గుండె పదికాలలపాటు పదిలం..

Heart Blockage Tips: హార్ట్ బ్లాకేజ్ రావడానికి ప్రధాన కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్.  ఎక్సర్ సైజులు చేయకపోవడం. అయితే, కొన్ని రకాల ఆహారాలను మన డైట్లో చేర్చుకుంటే హార్ట్ బ్లాకేజీకు చెక్ పెట్టొచ్చు ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : May 11, 2024, 07:52 AM IST
Heart Blockage: ఈ 10 ఫుడ్స్‌తో మీకు హార్ట్‌ బ్లాక్‌ సమస్యే ఉండదు.. గుండె పదికాలలపాటు పదిలం..

Heart Blockage Tips: ఈ మధ్యకాలంలో హార్ట్‌ బ్లాకేజీ సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఇది రానురాను ప్రాణంతంగా మారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నినివారించాలంటే లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను మన డైట్లో చేర్చుకోవాలి. మన గుండె ఆరోగ్యంగా 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది.

హార్ట్‌ బ్లాకేజీ..
హార్ట్‌ బ్లాకేజీ చాలామందిలో ఇది సాదారణంగా మారిపోతుంది. గుండె ఆరోగ్య పరిస్థితిని దారుణంగా మారుస్తుంది. ఈ సమస్యను కొన్ని లక్షణాలు ద్వారా గుర్తించుకోవచ్చు. ముందుగానే గుర్తించి చికిత్సలు తీసుకుంటే త్వరగా ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటపడవచ్చు. హార్ట్‌ బ్లాకేజీ అంటే ఏమిటి అంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం గుండె కండరాల లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కొలెస్ట్రాల్ పేరుకుపోవడం దీనివల్ల హార్ట్‌ బ్లాకేజీ జరిగే సమస్య ఏర్పడుతుంది. గుండెకు రక్తసరఫరా తగ్గుతుంది
హార్ట్ బ్లాకేజీ అనేది ప్రాణాంతక పరిస్థితి. మనకు ఉండే కొన్ని అనారోగ్య అలవాట్ల వల్ల ఏర్పడుతుంది డైట్ ఎక్ససైజ్ మన డైట్ లో చేర్చుకోవాల్సి వస్తుంది.

హార్ట్‌ బ్లాకేజీ లక్షణాలు..
చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వీక్నెస్ ,హార్ట్ బీట్ స్పీడ్ గా కొట్టుకోవడం.

హార్ట్ బ్లాక్ కేజీలను తగ్గించే ఆహారాలు..
ఓట్స్..
ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం వల్ల మీకు గుండే ఆరోగ్యంగా ఉంటుంది.

అవకాడో..
ఇందులో ఉండే మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి ఇది నాచురల్ పొటాషియం లాగా కూడా పనిచేస్తుంది దీంతో బిపి అదుపులో ఉంటుంది.

వెల్లుల్లి..
వెల్లుల్లి కూడా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని తగ్గిచేస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి.

గ్రీన్ టీ..
రోజు ఉదయం గ్రీన్ టీ తో మీ రోజున ప్రారంభిస్తే మీకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో కెటచిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్ లో కోకోవా అధికంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

ఆకుకూరలు..
మీ డైట్ లో ఆకుకూరలు చేర్చుకోవడం అవసరం. ఇందులో విటమిన్స్, మినరల్స్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ నివారించి బ్లడ్ సర్కులేషన్ మెరుగు పరుస్తాయి.

ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్ ఇందులో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాక్స్ ఉంటాయి. ఇది ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గిస్తుంది అర్టెరీ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇదీ చదవండి: త్రిఫలనీటిని పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు..

గింజలు..
వాల్నట్స్, బాదం వంటివి రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల ఈ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫ్యాట్స్ ,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండెకు మంచిది.

ఒమేగా 3 ఫిష్..
మేకరల్, సార్డినెస్ చేపలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ కొలెస్ట్రాల్ నివారించి అర్టెరీని ఆరోగ్యం చేస్తాయి.

ఇదీ చదవండి: చీయాసీడ్స్‌, పసుపునీటిని పరగడుపున తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..

బెర్రీస్..
బ్లూ బెర్రీ, స్ట్రాబెరీ, రాస్బెర్రీ వంటిపళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి గుండెకు ఎంత అవసరం ఇన్ల్ఫమేషన్‌ని తగ్గించి రక్త సరఫరా సరఫరాను మెరుగుపరుస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News