Tips For Hiccups: ఏం చేసినా ఎక్కిళ్లు ఆగడం లేదా? ఈ శక్తివంతమైన చిట్కాలు మీకోసం..

Home remedies For Hiccups: కొంతమంది తరచుగా ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు. ఎన్ని హోమ్ రెమెడీస్ వినియోగించిన ఉపసమనం పొందలేక పోతారు. అయితే ఈ రోజు మీకోసం కొన్ని శక్తివంతమైన ప్రత్యేకమైన హోమ్ రెమిడీస్ ని పరిచయం చేయబోతున్న అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2024, 10:34 PM IST
Tips For Hiccups: ఏం చేసినా ఎక్కిళ్లు ఆగడం లేదా? ఈ శక్తివంతమైన చిట్కాలు మీకోసం..

Home Remedies For Hiccups: మనలో ఎక్కిళ్లు రావడం ఒక సర్వసాధారణ సమస్య.. ప్రతి ఒక్కరిలో వారంలో ఒక రోజైన ఈ సమస్య వస్తుంటుంది. కొంతమందిలో ఈ సమస్య తినకూడని ఆహారాలు తిన్నప్పుడు కొన్ని పానీయాలు తాగినప్పుడు వస్తువు ఉంటుంది. అయితే ఇదే ఎక్కిళ్ల సమస్య తరచుగా వస్తే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇలాంటి సంకేతాలు కొంతమందిలోనే వస్తు ఉంటాయి. కాబట్టి తరచుగా ఎక్కిళ్ల సమస్యతో బాధపడేవారు తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతో మంచిది. అయితే అప్పుడప్పుడు ఈ సమస్యతో బాధపడే వారు మాత్రం కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సులభంగా ఈ ఎక్కిల్ల నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శుభ్రమైన నీటిని తీసుకోండి..
ఎక్కిళ్లు వచ్చే సమయంలో చాలామంది శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా తాగడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి బదులుగా శుభ్రమైన నీటిని తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా నీటిని తాగిన ఈ సమస్య నుంచి విముక్తి లభించకపోతే, రెండు పెద్ద గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల సులభంగా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశాలున్నాయి.

బెల్లం ముక్క..
ఎక్కువగా ఎక్కిళ్లతో బాధపడేవారు తప్పకుండా బెల్లం ముక్కను తినాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కొన్ని గుణాలు ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే బెల్లం నీటిని తాగడం వల్ల కూడా ఈ ఎక్కిళ్ల సమస్య నుంచి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ముక్కుని ఇలా మూసుకోండి..
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కిళ్లు తగ్గకుంటే తప్పకుండా ఈ మూడవ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు కేవలం మీ ముక్కును మూసుకొని నోటి నుంచి శ్వాసను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల సులభంగా ఈ ఎక్కిన సమస్య నుంచి విముక్తి లభిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

చిన్నపాటి ఎక్సర్సైజ్..
కొంతమందిలో ఎక్కిళ్ల సమస్య తగ్గడానికి వ్యాయామాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఎక్కిన సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట సూర్య నమస్కారంతో పాటు కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు తప్పకుండా ప్రతిరోజు 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News