Kakarakaya Pachadi: మధుమేహం ఉన్నవారికి కాకరకాయ నిల్వ పచ్చడి ఈ రెసిపీ.. షుగర్ లెవెల్స్ గురించి భయపడకండి!

Kakarakaya Pachadi recipe:చాలామంది కాకరకాయను కూరల్లో తినేందుకు ఇష్టపడరు ఇలాంటి వారి కోసం కాకరకాయ నిల్వ పచ్చడిని పరిచయం చేయబోతున్నాం. ఈ పచ్చడి నీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2024, 03:49 PM IST
 Kakarakaya Pachadi: మధుమేహం ఉన్నవారికి కాకరకాయ నిల్వ పచ్చడి ఈ రెసిపీ.. షుగర్ లెవెల్స్ గురించి భయపడకండి!

Kakarakaya Pachadi recipe: చాలామంది వారంలో ఒకసారైనా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటారు. అయితే చాలామంది కాకరకాయను కూరగాయ తినేందుకు ఇష్టపడరు ఎందుకంటే దీని రుచి చాలా చేదుగా ఉండడంతో ఎక్కువగా పిల్లలు తినేందుకు ఆసక్తి చూపలేక పోతారు. నిజానికి మధుమేహంతో బాధపడుతున్న వారు రోజుల్లో ఒక్కసారి అయినా కాకరకాయతో తయారు చేసిన సలాడ్ లేదా చట్నీని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు ఎందుకంటే ఈ కాకరలో రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించే అనేక పోషక గుణాలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు వీరు ఒక్కసారైనా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారు కాకరకాయ నిల్వ పచ్చడిని కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా కాకరకాయలు తినని వారు ఈ నిలువ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ కావాలంటారు. అయితే ఈ కాకరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
1/2 కిలో కాకరకాయ (తరిగినది)
5 టేబుల్ స్పూన్ల నూనె
1 టేబుల్ స్పూన్ ఆవాలు
1/2 టేబుల్ స్పూన్ మెంతులు
1 టేబుల్ స్పూన్ కారం పొడి
1 టేబుల్ స్పూన్ ఉప్పు
50 గ్రాములు పులిహారం
1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ పసుపు

తాలింపు కోసం:
ఆవాలు
కరివేపాకు
ఎండు మిరపకాయలు

తయారీ విధానం:

ముందుగా కాకరకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది అందులో ఆయన ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంత ఉప్పు వేసి 30 నిమిషాల పాటు బాగా నానబెట్టాలి.తర్వాత స్టౌ పై ఒక పాన్‌ పెట్టుకొని అందులో నూనెను వేసి బాగా వేడి చేస్తుంది. ఆవాలు మెంతులు వేసి బాగా వేయించుకోవాలి.ఆవాలు చిటపటలాడిన తర్వాత, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించాలి.ఆ తర్వాత నానబెట్టిన కాకరకాయ ముక్కలను నీటిని తొలగించి, పోపు పెట్టుకున్న మిశ్రమంలో వేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు బాగా ఉడికించి చల్లబరుచుకోవాలి.మరోసారి పోపు కోసం ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేయించి, పచ్చడిలో వేసి కలపాలి.
పచ్చడిని ఒక శుభ్రమైన, పొడిగా ఉన్న జాడీలో నిల్వ చేయండి.

చిట్కాలు:

కాకరకాయ ముక్కలు చేదుగా ఉండకుండా ఉండడానికి నానబెట్టిన ఉప్పు నీటిని తప్పకుండా వడకట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ నిల్వ పచ్చడి మరింత టేస్టీగా ఉండడానికి చింతపండు రసాన్ని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది.
మధుమేహం ఉన్నవారు ఇడ్లీ లేదా దోసెల్లో ఈ పచ్చడిని ప్రతిరోజూ తింటే మంచి ఫలితాలు పొందుతారు

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News