Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..

Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది. మరోవైపు దేశ వ్యాప్తంగా తెలంగాణ సహా 96 లోక్ సభ  నియోజకవర్గాలకు  4 విడతలో భాగంగా  నేడు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 18, 2024, 12:38 PM IST
Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..

Telangana Election Notification: మరికొన్ని గంటల్లో తమిళనాడులోని 39 లోక్ సభతో పాటు దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికల జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి ఘట్టం రేపు ఆవిష్కృతం కానుంది. మరోవైపు ఏప్రిల్ 26న రెండో విడతలో భాగంగా 89 లోక్ సభ సీట్లకు ఎన్నికల జరగనున్నాయి. మరోవైపు మూడో విడతలో భాగంగా  మే 7న 94 స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి.  మే 13న జరగబోయే 96 లోక్ సభ స్థానాలకు  4వ విడతలో భాగంగా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ నేడు ఎన్నికల కమిషనర్ విడుదల చేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు  అటు ఏపీలోని 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు నేడే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 8 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు. .ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు.. జార్ఘండ్‌లోని 4 లోక్ సభ సీట్లు.. మొత్తంగా మే 13న  9 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శ్రీనగర్‌కు ఎన్నికలకు జరనుంది. తాజాగా ఆయా స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప  ఎన్నికల జరగనుంది.

ఏప్రిల్ 25 వరకూ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్దుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్‌గా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4న 543 స్థానాలకు  కౌంటింగ్ నిర్వహిస్తారు.

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు 13 రకాల డాక్యుమెంట్లు సమర్ఫించాల్సి ఉంటుంది.  ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకు పోటీ చేసే అభ్యర్ధులు ఫారమ్ 2బిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి  మద్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరణ ఉండదని ఎన్నికల కమిషనర్ చెప్పారు.  అభ్యర్ధులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్ధి నామినేషన్‌ను నేరుగా లేదా ప్రపోజర్ ద్వారా సమర్ధించవచ్చు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా 2 నియోజకవర్గాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధితో పాటు కేవలం ఐదుగురికి మాత్రమే కలిసి నామినేషన్ సమర్ఫించాల్సి ఉంటుంది.

ఎన్నికల్లో నామినేషన్‌తో పాటు అభ్యర్ధులు ఫారమ్ 26 సమర్ఫించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్ధుల వ్యయాన్ని ఎన్నికల కమిషనర్ లెక్కిస్తోంది. వివిధ వార్తా పత్రికలు.. న్యూస్ ఛానెల్స్‌లలో వచ్చే ప్రకటనలు కూడా ఆయా అభ్యర్ధుల ఖాతాలో వేస్తారు. శాసనసభకు పోటీ అభ్యర్ధులు 10 వేలు డిపాజిట్ చేయాలి. అటు పార్లమెంట్ లోక్ సభకు పోటీ చేసే అభ్యర్ధులు 25 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులైతే.. 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్దులు కలెక్టరేట్లలో.. అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

Also read: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News