5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఐదో దశలో పోలింగ్ జరిగేది ఈ లోక్ సభ సీట్లలోనే.. !

5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో  543 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు 5వ విడతలో భాగంగా 49 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిషా, యూపీ, బిహార్, మహారాష్ట్ర సహా ఏయే లోక్‌సభ సీట్లకు   పోలింగ్ జరుగుతుందంటే..  

Written by - TA Kiran Kumar | Last Updated : May 20, 2024, 07:10 AM IST
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఐదో దశలో  పోలింగ్ జరిగేది  ఈ లోక్ సభ సీట్లలోనే.. !

5th Phase Lok Sabha Polls 2024: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల క్రతువు అంటే మాములు విషయం కాదు. వివిధ ప్రాంతాల్లో డిఫరెంట్ భౌగోళిక  పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 18 లోక్ సభకు ఇప్పటికే ఏప్రిల్ 19 ఫస్ట్ ఫేస్‌లో 102 స్థానాలు.. రెండు విడతలో 88 లోక్‌సభ సీట్లు.. మూడో దశలో 92 లోక్‌సభ సీట్లు.. నాల్గో దశలో 96 స్థానాలు.. ఐదో దశలో నేడు 49 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న 543 స్థానాల్లో 542 సీట్లలో ఎవరు గెలిచారనేది ఎన్నికల కమిషన్ ప్రకటిస్తోంది.

మహారాష్ట్రలోని 13 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
 
1. ధూలే
2. దిందోరి
3. నాసిక్
4. పాల్ఘర్
5. భివాండి
6. కళ్యాణ్
7. థానే
8. ముంబై నార్త్
9. ముంబై నార్త్ వెస్ట్
10. ముంబై నార్త్ ఈస్ట్
11. ముంబై నార్త్ సెంట్రల్
12. ముంబై సౌత్ సెంట్రల్
13. ముంబై సౌత్

బిహార్‌లోని 5 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
1. సీతామర్హి
2. మధుబని
3. ముజఫర్ నగర్
4. సరన్
5. హాజీపూర్  

ఒడిషాలోని 5 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..

1. బార్గర్
2. సుందర్‌ఘర్
3. బోలాన్‌గిర్
4. కందమాల్
5. అస్కా

ఉత్తర ప్రదేశ్‌లోని 14 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..

1. మోహన్‌లాల్ గంజ్
2. లక్నో
3. రాయబరేలి
4. అమేఠి
5. జాలాన్
6. ఝాన్సీ
7. హమిర్‌పూర్
8. బందా
9. ఫతేపూర్
10. కౌశాంబి
11. బారాబంకీ
12. ఫైజాబాద్ (అయోధ్య)
13. కైసర్ గంజ్
14. గోండా

పశ్చిమ బెంగాల్‌ లోని 7 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..

1. బాంగోన్
2. బారక్‌పూర్
3. హౌరా
4. ఉలుబేరియా
5. శ్రీరామ్ పూర్
6. హూగ్లీ
7. అరాంబాగ్

ఝార్ఖండ్ లోని 3 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
1. చత్రా
2. కోదర్మ
3. హజారీబాగ్

జమ్మూ కశ్మీర్‌లోని
1. బారా ముల్లా

లడ్డాక్ లోని ఒక లోక్‌సభ సీట్లకు ఎన్నిలు జరగుతున్నాయి.

5వ విడత ఎలక్షన్స్‌తో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు 429 సీట్లకు ఎన్నికలు పూర్తవుతాయి. మరో రెండు ఫేజ్‌లలో 114 లోక్‌సభ సీట్లతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. జూన్ 4 మొత్తం లోక్‌సభ సీట్లకు ఎన్నికల  కౌంటింగ్‌తో పాటు అరుణాల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లకు కూడా కౌంటింగ్ జరగనుంది.

Also read: Strawberries Health: స్ట్రాబెర్రీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News