5th Phase Lok Sabha Polls 2024: ఐదో విడతలో భాగంగా మహారాష్ట్ర, యూపీ, బెంగాల్ సహా దేశ వ్యాప్తంగా 49 లోక్‌సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్..

5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఐదో దశలో భాగంగా 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, యూపీ, ఒడిషా సహా పలు రాష్ట్రాలకు నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 20, 2024, 07:25 AM IST
5th Phase Lok Sabha Polls 2024: ఐదో విడతలో భాగంగా మహారాష్ట్ర, యూపీ, బెంగాల్ సహా దేశ వ్యాప్తంగా 49 లోక్‌సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్..

5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు 7 విడతల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 4 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 5వ విడతలో భాగంగా నేడు 49 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. భారత దేశ వ్యాప్తంగా జమ్మూ కశ్మీర్, లద్దాక్‌ కలిసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిషా సహా ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒడిషాలోని 5 పార్లమెంట్ స్థానాలతో పాటు 35 శాసనసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని కీలకమైన ముంబై పరిసర ప్రాంతాల్లోని 13 లోక్‌సభ సీట్లకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.  

అటు ఉత్తర ప్రదేశ్‌లోని 14 లోక్‌సభ సీట్లతో పాటు బిహార్‌లోని 5 లోక్‌సభ సీట్లు.. పశ్చిమ బంగాల్‌లోని 7 లోక్ సభ సీట్లతో పాటు.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని 3 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరగునున్నాయి. అటు జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, లడక్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు పూర్తవుతాయి. ఈ ఎన్నికల్లో కేంద్ర రక్షణ మంత్రి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నుంచి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు యూపీలోని రాయబరేలి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి రాహుల్ తాతగారైన ఫిరోజ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీతో పాటు.. తల్లి సోనియా గాంధీ పోటీ చేసిన హిస్టరీ ఉండటంతో ఈ స్థానంపై అత్యంత ఆసక్తి నెలకొంది.
 
అటు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరారీ అమేఠీ నుంచి పోటీ చేస్తోంది. అటు బిహార్‌లోని హాజీపూర్ నుంచి ఎల్జీపీ ఛీఫ్ చిరాగ్ పాశ్వాన్ బరిలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. 5వ విడత జరిగే ఎన్నికల్లో పలు సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో ఎలక్షన్ కమిషన్ తగిన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది.

5వ విడత ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు 429 సీట్లకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తోంది. మరో రెండు విడతల్లో జరిగే 114 సీట్లకు జరిగినే ఎన్నికలతో మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. 18 లోక్‌సభకు జరగుతున్న ఎన్నికల్లో ఎక్కువ లోక్ సభ సీట్లకు గెలిచే పార్టీనే కేంద్రంలో అధికారం చేపట్టనుంది. మొత్తంగా ఈ ఎలక్షన్ మన దేశ భావి భారత ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తంగా ఎన్నికల దేశానికి కాబోయే ప్రైమ్ మినిష్టర్ ఎవరనేది జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News