Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో కరోనా లేదు.. సీఎం మమత నటిస్తోంది: బీజేపీ నేత

CoronaVirus In India | ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి  విజృంభిస్తోంది. విదేశీయులకే కరోనా వస్తుందని, విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చిందని.. భారతీయులకు కరోనా సోకలేదంటూ మొదట్లో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కానీ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పాకులాడుతున్నారు.

Last Updated : Sep 11, 2020, 10:32 AM IST
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో కరోనా లేదు.. సీఎం మమత నటిస్తోంది: బీజేపీ నేత

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి విజృంభిస్తోంది. విదేశీయులకే కరోనా వస్తుందని, విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చిందని.. భారతీయులకు కరోనా సోకలేదంటూ మొదట్లో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఆపై లాక్‌డౌన్‌లు విధించినా కరోనా మహమ్మారి వదలడం లేదు. కానీ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పాకులాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (West Bengal BJP President Dilip Ghosh) చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. Telangana: కొత్తగా 2,426 కరోనా కేసులు

‘పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ అంతమైంది. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇంకా కరోనా ఉందని నటిస్తున్నారు. కరోనా సాకుతో రాష్ట్రంలో నేటికీ లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఎన్నో నిబంధనలు అమలు చేస్తున్నారు. బీజేపీ సమావేశాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే సీఎం మమత లాక్‌డౌన్ రూల్స్ అమలు చేస్తున్నారు. అయితే మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మేం చేయాలనుకున్నది చేసి తీరేందుకు సిద్ధమంటూ’ ధనియాఖాళీలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీస్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. Sravani Suicide Case: లొంగిపోయిన దేవరాజ్..

కాగా, పశ్చిమ బెంగాల్‌లో నిన్నటివరకూ మొత్తం లక్షా 93 వేల 175 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 3,771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 41 మంది కరోనాతో మరణించారు. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, పదుల సంఖ్యలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా.. బెంగాల్‌లో కరోనా వైరస్ లేదని, తమ పార్టీ మీటింగ్‌ పెట్టకూడదనే నిషేధం విధిస్తున్నారంటూ బీజేపీ నేత వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. వీటిని కరోనా కేసులు అనకపోతే ఇంకేమంటారని అధికార టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. TS Inter Calendar: మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు 

ఫొటో గ్యాలరీస్:

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News