Himachal Pradesh: దంచి కొడుతున్న వాన.. 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల నష్టం?

భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణ నష్టం తో పాటు ఆర్థిక నష్టం కూడా ఎదురవ్వగా.. 74 మంది మృత్యువాత పడగా.. దాదాపు 10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా.. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2023, 01:20 PM IST
Himachal Pradesh: దంచి కొడుతున్న వాన.. 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల నష్టం?

Himachal Pradesh: ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాలు మునిగిపోయి తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నాయి. కొన్నిచోట్ల వరదల్లో ఇరుక్కొని చాలామంది మృతి చెందారు కూడా. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశాలలో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి రాష్ట్రంలో ఏకంగా 74 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు.

నైరుతి రుతుపవనాలు ప్రారంభమై 55 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ఏర్పడుతున్నాయని.. దీనివల్ల కొండ చర్యలు విరిగే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణపరంగా దుర్భలమైన హిమాలయాల్లో ఆ శాస్త్రీయ నిర్మాణాలు, తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే వాగుల దగ్గర నిర్మాణాల వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక 113 కొండ చర్యలు విరిగిపడటంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రూ.2,491 కోట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కి రూ.1,000 కోట్ల నష్టం ఎదురయింది అని అధికారులు తెలిపారు. ఇక సిమ్లా లోని సమ్మర్ హిల్ లో, రైల్వే ట్రాక్లలో కొంత భాగం కొట్టుకుపోయిందని.. కొన్నిచోట్ల పట్టాలు గాలిలో వేలాడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా సిమ్లా, సోలన్, మండి, చంబ వంటి అక్కడ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Also Read: Home Buying Tips: ఇళ్లు కొంటున్నారా..? ఈ ఐదు తప్పులు అస్సలు చేయకండి  

ఆదివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసాయని.. మంగళవారం తర్వాత తగ్గుముఖం పట్టినట్లే పట్టి గురువారం మళ్లీ చిరుజల్లులు పడ్డాయి. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన వర్షాలకు 217 మంది మరణించారు అని తెలిసింది. ఇక సిమ్లా దేవాలయం కొండ చర్యలు విరిగిపడటంతో మూడు తరాలకు చెందిన ఏడుగురు కుటుంబాలు మరణించాయని.. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు సభ్యులు లోపల ఉండగా శివాలయం కూలిపోయింది అని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న టూరిజం, యాపిల్ వ్యాపారం దారుణంగా  పడిపోయాయని.. టాక్సీ డ్రైవర్లు గతంలో రోజుకు రెండువేల రూపాయలు సంపాదించేవారు అని.. కానీ ఇప్పుడు రూ.200 కంటే తక్కువగా సంపాదిస్తున్నారు  అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా 50 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ ఉన్న హోటల్లు కూడా ఇప్పుడు ఐదు శాతానికి పడిపోయాయని అన్నారు. ఇక ఈ వర్షాల ప్రభావం వల్ల మరెన్ని నష్టాలు వాటిల్లుతాయో చూడాలి.

Also Read: MLA Etela Rajender: రైతుల మీద జలగల్లాగా బతకవద్దు.. నీకు రోజులు దగ్గరపడ్డాయ్.. సీఎం కేసీఆర్‌కు ఈటల హెచ్చరిక  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News