గుడ్ న్యూస్: గృహ, వాహన రుణాలపై తగ్గనున్న ఈఎంఐ భారం

గుడ్ న్యూస్: గృహ, వాహన రుణాలపై తగ్గనున్న ఈఎంఐ భారం

Last Updated : Aug 23, 2019, 10:30 PM IST
గుడ్ న్యూస్: గృహ, వాహన రుణాలపై తగ్గనున్న ఈఎంఐ భారం

గృహ, వాహన రుణాలపై బ్యాంకులు త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వివిధ అవసరాల కోసం రుణం తీసుకునే వినియోగదారులసై నెలవారీ ఈఎంఐల భారం తగ్గనుందని అన్నారు. ప్రతి త్రైమాసికంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తూ వస్తున్నప్పటికీ బ్యాంకులు ఆ ఫలాలను వినియోగదారులకు అందించడం లేదని చెప్పిన నిర్మలా సీతారామన్.. తాజాగా వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని స్పష్టంచేశారు. ''ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)'' తగ్గింపు ద్వారా వచ్చే అన్ని రుణాలపై వడ్డీ రేట్లను కూడా అదే స్థాయిలో తగ్గించి రుణగ్రహీతలకు లబ్ధి చేకూర్చాలని బ్యాంకులు నిర్ణయించాయని అన్నారు. ఈ నేపథ్యంలో గృహ, వాహన రుణాలు సహా ఇతర రిటైల్ రుణాలకు చెల్లించే ఈఎంఐ భారం తగ్గనుందని మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. 

బ్యాంకులు రెపో రేట్లను వడ్డీ రేట్లకు నేరుగా అనుసంధానం చేయడమే ఇఎంఐ భారం తగ్గడానికి కారణం అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐతో పలుమార్లు చర్చలు జరిపినట్టు ఆమె తెలిపారు.

Trending News