Nupur Sharma: నుపుర్ శర్మ అభ్యర్థనకు నో..క్షమాపణ చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరణ..!

Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈక్రమంలో బీజేపీ నేత నుపుర్ శర్మ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇప్పటివరకు జరిగిన ఘటనలకు ఆమె బాధ్యురాలని సీరియస్ అయ్యింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 1, 2022, 04:48 PM IST
  • మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు
  • నుపుర్ శర్మ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్
  • ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Nupur Sharma: నుపుర్ శర్మ అభ్యర్థనకు నో..క్షమాపణ చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరణ..!

Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈక్రమంలో బీజేపీ నేత నుపుర్ శర్మ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇప్పటివరకు జరిగిన ఘటనలకు ఆమె బాధ్యురాలని సీరియస్ అయ్యింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని తెలిపింది. ఓ టీవీ ఛానల్‌లో డిబేట్ సందర్భంగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీనిపై సీరియస్ అయిన బీజేపీ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన నుపుర్ శర్మపై పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈక్రమంలోనే తనకు ప్రాణ హాని ఉందని కేసులన్నీ ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన బెంచ్..నుపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈసందర్భంగా భారత సర్వోన్నత న్యాయ స్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నుపుర్ శర్మ టీవీ డిబెట్ చూశామని..ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని అభిప్రాయపడింది. తన వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది భావోద్వేగాలను రెచ్చగొట్టారని..ఆ తర్వాత ఎన్నో ఘటన చోటుచేసుకున్నాయని తెలిపింది. ఇటీవల జరిగిన దారుణ ఘటనలకు పూర్తి బాధ్యురాలు ఆమెనని స్పష్టం చేసింది కోర్టు. నుపుర్ శర్మ వ్యాఖ్యలు అహంకారాన్ని తెలియజేస్తున్నాయని..వెంటనే క్షమాపణ చెప్పాలని తేల్చి చెప్పింది.

దీనిపై నుపుర్ శర్మ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిబేట్‌లో టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పారని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు టీవీ యాంకర్‌పై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆమెపై నమోదైన కేసులన్నీ ఢిల్లీకి బదిలీ చేసేందుకు న్యాయ స్థానం నిరాకరించింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈక్రమంలోనే ఆమె పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Also read: Tirumala: తిరుమలలో యథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..టీటీడీ కీలక నిర్ణయం..!

Also read:Rain Alert: దేశమంతటా విస్తరించిన నైరుతి రుతు పవనాలు..లెటెస్ట్ వెదర్‌ రిపోర్ట్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News