Heavy Rains Alert: ఆ ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ ఎలర్ట్, రేపు అతి భారీ వర్షం తప్పదా

Heavy Rains Alert: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మేఘాలు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. అంటే క్లౌడ్ బరస్ట్ ఘటన ఉండవచ్చని అంచనా. అందుకే 5 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2023, 01:22 PM IST
Heavy Rains Alert: ఆ ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ ఎలర్ట్, రేపు అతి భారీ వర్షం తప్పదా

Heavy Rains Alert: నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఉత్తరాదిన ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షం కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. జూలై 17 అంటే రేపు క్లౌడ్స్ బరస్ట్ కావచ్చని తెలుస్తోంది. ఏయే రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే..

భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాల్ని ఇప్పట్లో వదిలేలా లేవు. ఢిల్లీలో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మద్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగానే ఆ రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి ఆరెంజ్ ఎలర్ట్ జారీ అయింది. ఇక మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. 

క్లౌడ్ బరస్ట్ అంటే దాదాపుగా మేఘాలు విరుచుకుపడినట్టే. ఒక్కసారిగా ఒకేరోజు అతి భారీ వర్షం కురుస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ ప్రమాదం పొంచి ఉంది. జూలై 17వ తేదీన ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, మద్య మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే 5 రోజులు అతి భారీ వర్షాలు తప్పవు. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక జూలై 19వ తేదీన గుజరాత్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విరుచుకుపడవచ్చు.

మరోవైపు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సైతం జూలై 18, 19 తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కర్ణాటకతో పాటు తెలంగాణ, కేరళ, మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు పడవచ్చు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ , హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఫలితంగా గంగా, యుమన నదుల ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే యమునా నది వరదలతో జలదిగ్భంధనంలో చిక్కుకున్న ఢిల్లీ మరోసారి వణికిపోయింది. ఇప్పటికీ ఢిల్లీలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. 

Also read: Tomato Price: చుక్కలు చూపిస్తున్న టమాటా ధర.. ఆ మార్కెట్లో కిలో టమాటా రూ.300కు పైనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News