IMD Weather Updates: రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు

IMD Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులు వర్షాలు  విస్తారంగా పడనున్నాయి. వచ్చే 24 గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2023, 07:32 AM IST
IMD Weather Updates: రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు

IMD Weather Updates: ఈ ఏడాది వర్షాకాలం అస్తవ్యస్థంగా ఉందని చెప్పవచ్చు. జూన్ నెలంతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా, జూలైలో విస్తారంగా కురిసిన వర్షాలతో వర్షపాతం లోటు కాస్తా రికవర్ అయింది. ఆగస్టులో మళ్లీ వర్షాల జాడే కన్పించడం లేదు. ఈ క్రమంలో రానున్న మూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా పడనున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. హైదరాబాద్‌లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడవచ్చు. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఇప్పటికే అంటే నిన్న ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ములుగులో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ముసురు పట్టుకుంది. ఈ వాతావరణం మరో రెండ్రోజులుండవచ్చు. అదిరాబాద్, కుమురం భీమ్ , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సహా మొత్తం 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. 

ఇక ఏపీలో కూడా రానున్న మూడ్రోజులు కోస్తా జిల్లాలకు  వర్ష సూచన జారీ అయింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంద్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. ఇక సముద్రతీరంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పార్వతీపురం, శ్రీకాకుళం,  అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి  బలమైన గాలులు వీయనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Also read: Chandrayaan 3: మరో 96 గంటల్లో ప్రపంచం గర్వించే విధంగా ఇస్రో ఖ్యాతి, ఆగస్టు 23న చంద్రయాన్ 3 సక్సెస్ ఖాయమే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News