Why Modi Photos: అక్కడ ప్రధాని మోదీ ఫొటోలు ఎందుకయ్య? అవసరమా? ముఖ్యమంత్రి నిలదీత

PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 12, 2024, 11:09 PM IST
Why Modi Photos: అక్కడ ప్రధాని మోదీ ఫొటోలు ఎందుకయ్య? అవసరమా? ముఖ్యమంత్రి నిలదీత

Kerala Assembly Session: గతంలో తెలంగాణలో ప్రధాని మోదీ ఫొటోలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ నిలదీసిన సంఘటన తీవ్ర రాజకీయకు దారి తీయగా.. తాజాగా అదే విషయమై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిలదీశారు. అయితే ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. పౌరసరాల చౌకధర దుకాణాల్లో ప్రధాని ఫొటో ఉండడం ఎందుకు? అని నిండు అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. 'అలా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా?' ఓ ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు సీఎం విజయన్‌ వివరణ ఇచ్చారు.

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అబ్ధుల్‌ హమీద్‌ ఓ ప్రశ్న అడిగారు. 'రేషన్‌ దుకాణాల్లో ప్రధాని మోదీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా?' అని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న లేవనెత్తారు.

Also Read: GPS Based Toll: ఇక ఫాస్టాగ్‌కు బై బై.. తెరపైకి కొత్త టోల్‌ విధానం.. ఇక హైవేపై రయ్యిన దూసుకెళ్లొచ్చు

ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వయంగా సమాధానం చెప్పారు. 'రాష్ట్రంలో ఎప్పటి నుంచే రేషన్‌ వ్యవస్థ ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త పబ్లిసిటీ పద్ధతి అవలంభిస్తోందని స్పష్టమవుతుంది. ఈ ఆదేశాలు సరికావు. వాటిని రాష్ట్రంలో అమలు చేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలా లేదా? అనే నిర్ణయంపై కూడా ఆలోచనలు చేస్తాం' అని తెలిపారు.

ఇదే అంశంపై పౌరసరఫరా శాఖ మంత్రి అయిన జీఆర్‌ అనిల్‌ మరింత వివరణ ఇచ్చారు.'రాష్ట్రంలో 14 వేలకు పైగా ప్రధాని మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుచేయాలని ఫుడ్‌ కార్పొరేషన్‌ సంస్థకు, రాష్ట్ర ఆహార శాఖకు బాధ్యత అప్పగించింది. కేరళలోని ఎంపిక చేసిన 550 రేషన్‌ దుకాణాల్లో పీఎం సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించింది. వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఎఫ్‌సీఐ అధికారులకు సూచించారు కూడా. ఎన్నికల ప్రచారం కోసం రేషన్‌ దుకాణాలను వినియోగించుకోవడం సరికాదు' అని విమర్శించారు.

దేశవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల వద్ద 'పీఎం సెల్ఫీ పాయింట్‌'లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ సెల్ఫీ పాయింట్లు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు తీవ్ర వివాదమవుతోంది. పేదలకు ఇచ్చే బియ్యం వద్ద కూడా రాజకీయం చేయడం తగదని బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీకి ప్రచార పిచ్చి బాగా పెరిగిందని విమర్శలు చేస్తున్నారు. పేదలకు పంపిణీ చేసేదే అరకొర దానిని కూడా ప్రచారాన్ని వాడుకోవాల? అని నిలదీస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News