Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..

Loksabha elections 2024: భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ బాలుడు ఓటు వేశాడు. పోలింగ్ బూత్ లోకి తన తండ్రి బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తో కలిసి వెళ్లి ఓటు వేశాడు. అంతే కాకుండా దీన్ని తన మొబైల్ ఫోన్ లో కూడా రికార్డు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 9, 2024, 08:13 PM IST
  • ఓటు వేసిన మైనర్ బాలుడు..
  • మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు..
Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..

Madhya pradesh bjp leader minor son casts vote in bhopal berasia: దేశంలో కేంద్ర,రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటాయి. ఎన్నికల సంఘాన్ని అత్యుత్తమమైన స్వయం ప్రతిపత్తిగలదని చెబుతుంటారు. ప్రధానులు,సీఎంలు, ఎవరైన ఎన్నికల సమయంలో ఈసీ నియమావళికి లోబడే ప్రవర్తించాలి. ఒకవేళ ఈసీకి నియమాలకు విరుద్ధంగా ఎవరు వెళ్లిన కూడా ఈసీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఎన్నికలు ముగిసి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా ఈసీ కీలకంగా వ్యవహరింస్తుంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తుంది. ఎన్నికలు జరిగే చోట ఎవరైన అధికారులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు ఎవరినైన విధుల్లో నెగ్లీజెన్సీగా ఉన్నట్లు భావించిన లేదా ఎవరికైన నేతలకు ఫెవర్ గా ఉన్నట్లు ఈసీ భావించిన వారిపైన ఈసీ వెంటనే బదిలీ వేటు వేస్తుంది.

 

ముఖ్యంగా ఎన్నికలు ముగిసే వరకు ఈసీ ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో  ఎన్నికలను పకట్భందీగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా ఈసీ అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది. అయితే.. ఎన్నికల వేళ కొందరు నాయకులు అతీగా ప్రవర్తింస్తుంటారు. కావాలని ఈసీ నియమావళిని తుంగలో తొక్కి వివాదాలకు కారణమౌతుంటారు. ఎన్నికల వేళ ప్రచారంలో, ఎన్నికల సమయంలో, ఎన్నికలుముగిసాక కూడా ఈసీ నియమాలు పాటించాలి. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కొందరు నాయకుల ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా ఉంటాయి. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో ఇటీవల లోక్ సభ ఎన్నికలు జరిగాయి. స్థానికంగా బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తన కొడుకుతో కలసి పొలింగ్ బూత్ కు వచ్చి ఓటేశాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. బీజేపీ నేత వినయ్ కుమార్ తన కుమారుడితో పోలీంగ్ బూత్ లోపలి వరకు వచ్చేశాడు. అంతేకాకుండా ఈవీఎం మిషన్ వద్ద ఆయన కొడుకుతో బీజేపీకి ఓటు వేసినట్లు బటన్ నొక్కించారు. ఈ తతాంగాన్ని ఫోన్ లో వీడియో కూడా తీశారు. ఇది వివాదానికి కేరాఫ్ గామారింది.దీనిపైన కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బీజీపీ నేతలు... ఈసీని, ఎన్నికలను ఆటవస్తువుగా మార్చిందనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మీడియా మాట్లాడుతూ.. పోలింగ్ బూట్ లోకి పిల్లాడిని అనుమతించడం ఏంటని ఫైర్ అయ్యారు. మొబైల్ ఫోన్‌ను పోలింగ్ బూత్‌లోకి ఎలా అనుమతించారు, పిల్లవాడు తన తండ్రితో పాటు బూత్‌లోకి ఎలా అనుమతించబడ్డాడు అనే ప్రశ్నలు అడిగారు.

Read More: Sweat Rice Balls: అందమైన అమ్మాయిల చంకలోని చెమటతో టెస్టీ డిష్.. ఎగబడుతున్న స్థానికులు.. కారణం ఏంటంటే..?

బీజేపీ ఎన్నికల కమిషన్‌ను పిల్లల ఆట వస్తువుగా మార్చిందంటూ ఎద్దేవా చేశారు.. భోపాల్‌లో బీజేపీ జిల్లా పంచాయతీ సభ్యుడు వినయ్‌ మెహర్‌ తన మైనర్‌ కుమారుడికి ఓటు వేయించాడు. వినయ్‌ మెహర్‌ ఓటు వేసే సమయాన్ని వీడియో కూడా తీసిన వినయ్‌ మెహర్‌ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.  ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇక .. ఈ వీడియోపై ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు. ఈవీడియో ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ విచారణకు ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారి సందీప్ సైనీని సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన బెరాసియా అసెంబ్లీ సెగ్మెంట్ షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News