PM Narendra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..

PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 14, 2024, 01:11 PM IST
PM Narendra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..

PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. ఈ నామినేషన్ సందర్బంగా తన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితుడైన జ్ఞానేశ్వర్ శాస్త్రి, బీజేపీ సీనియర్ కార్యకర్త బైద్యనాథ్ పటేల్ ఆయన వెంట ఉన్నారు. వీళ్లిద్దురు నరేంద్రమోదీ నామినేషన్ పత్రాలపై సాక్షి సంతకాలు చేసారు. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో 379 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. మరో మూడు విడతల్లో 164 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు మరో మూడో విడతల్లో జరగనుంది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తోన్న వారణాసి సహా 57 లోక్ సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరనుంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇప్పటికే మోడీ ఎన్నికల నామినేషన్‌కు సంబంధించిన వారణాసిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు దేశంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన వారణాసి నియోజవర్గం నుంచి భారీ మెజారిటీలో లోక్ సభలో అడుగుపెట్టారు.

నిన్ననే వారణాసి చేరుకొని హిందూ బెనరాస్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు భారతరత్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూల మాల వేసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు నామినేషన్‌ దాఖలకు ముందు ఆయన కొన్ని కిలో మీటర్ల మేర వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. ఈ అంతకు ముందు వారణాసిలో పలు పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయే నేతలు భారీగా హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభ పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో ఈయన 63.62 % ఓట్ల భారీ మెజారిటితో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి శాలిని యాదవ్ పై 6,74,664 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే.. మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా పలు రికార్డులు ప్రధాన మంత్రి మోదీ పేరిట నమోదు కానున్నాయి. ఏడు విడతల ఎన్నికల తర్వాత జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వారే తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. అంతేకాదు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం గ్యారంటీ అని అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అజయ్ రాయ్‌ను పోటీ చేస్తున్నాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజస్తాన్‌కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి బరిలో ఉన్నారు.  ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో 379 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. మరో మూడు విడతల్లో 164 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు మరో మూడో విడతల్లో జరగనుంది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి  పోటీ చేస్తోన్న వారణాసి సహా 57 లోక్ సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరనుంది.

 

ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇప్పటికే మోడీ ఎన్నికల నామినేషన్‌కు సంబంధించిన వారణాసిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.  ఇప్పటికే ఆయన రెండు సార్లు  దేశంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన వారణాసి నియోజవర్గం నుంచి భారీ మెజారిటీలో లోక్ సభలో అడుగుపెట్టారు. నిన్ననే వారణాసి చేరుకొని హిందూ బెనరాస్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు భారతరత్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూల మాల వేసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ రోజు నామినేషన్‌ దాఖలకు ముందు ఆయన కొన్ని కిలో మీటర్ల మేర వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. ఈ అంతకు ముందు వారణాసిలో పలు పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయే నేతలు భారీగా హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభ పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో ఈయన 63.62 % ఓట్ల భారీ మెజారిటితో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి శాలిని యాదవ్ పై 6,74,664 ఓట్ల తేడాతో గెలుపొందారు.

2024లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే.. మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ  ప్రధాని అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా పలు రికార్డులు ప్రధాన మంత్రి మోదీ పేరిట నమోదు కానున్నాయి. ఏడు విడతల ఎన్నికల తర్వాత జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వారే తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. అంతేకాదు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం గ్యారంటీ అని అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి.
 
ఇక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అజయ్ రాయ్‌ను పోటీ చేస్తున్నాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజస్తాన్‌కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి బరిలో ఉన్నారు.

Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News