Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్ట్ రన్‌వే పై స్కిడ్ అయిన ప్రవేట్ జెట్.. ముగ్గురికి గాయాలు

విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది. ముగ్గురు గాయపడగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 07:43 PM IST
Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్ట్ రన్‌వే పై స్కిడ్ అయిన ప్రవేట్ జెట్.. ముగ్గురికి గాయాలు

Private plan Crashed in Mumbai: ముంబై ఎయిర్‌పోర్ట్ లో ప్రైవేట్ ప్లేన్ క్రాష్ అయింది. విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా (veer off) క్రాష్ అయింది. క్రాష్ అయిన విమానంలో ఆరుగురు ప్రయాణికులు మరియు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. PTI తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు క్రాష్ అయిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపడుతున్నారు. 

VSR వెంచర్స్ లీర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ VT-DBL వైజాగ్ నుండి ముంబైకి ఆపరేటింగ్ ఫ్లైట్ ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఎయిర్‌క్రాఫ్ట్ లో ఉన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన ప్రకటన ప్రకారం.. "ల్యాండింగ్ సమయంలో భారీ వర్షంతో 700 విసిబిలిటీ ఉందని" పేర్కొన్నారు. 

Also Read: Maruti Suzuki Discount: పండగ ఆఫర్.. ప్రతి మారుతి కారుపై రూ.65 వేల భారీ డిస్కౌంట్.. ఆఫర్ నెల రోజులు మాత్రమే!

డ్యూటీ ఆఫీసర్ తెలిపిన దాని ప్రకారం.. భారీ వర్షం కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్ రన్‌వే నుండి జారిపోయి.. దేశీయ విమానాశ్రయంలో కూలిపోయిందని తెలిపారు. ప్రమాదం కారణంగా రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు మరియు మిగతా విమానాలను ఎయిర్ పోర్ట్ అధికారులు దారి మళ్లించారు. 

Also Read: Chandrababu Arrest: చంద్రబాబుకు మళ్లీ నిరాశ, బెయిల్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News