West Bengal: బీజేపీ వర్సెస్ ప్రశాంత్ కిశోర్..తీవ్రమౌతున్న మాటల యుద్ధం

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఆరు నెలల ముందే వేడి రాజుకుంది. బీజేపీ నేతలకు..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

Last Updated : Dec 22, 2020, 11:21 PM IST
West Bengal: బీజేపీ వర్సెస్ ప్రశాంత్ కిశోర్..తీవ్రమౌతున్న మాటల యుద్ధం

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఆరు నెలల ముందే వేడి రాజుకుంది. బీజేపీ నేతలకు..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలు ( West Bengal Assembly Elections ) మరో ఆరు నెలల్లో జరగనున్నాయి. ఇప్పట్నించే రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ ( Bjp president jp nadda )‌పై జరిగిన రాళ్ల దాడి రాష్ట్రంలో పరిస్థితిని మరింత వేడెక్కించింది. అనంతరం బెంగాల్‌లో జరిగిన అమిత్ షా ( Amit shah ) పర్యటన మొత్తం టీఎంసీ ( TMC ) కోటను కూల్చేదిశగానే సాగింది. బీజేపీ నేతలు వరుస ర్యాలీలతో టీఎంసీ ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )కు మద్దతుగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలో దిగారు.  బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తూ సవాలు విసురుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిశోర్ ( Prashant kishor ). అమిత్ షా చెబుతున్నట్టుగా బెంగాల్‌లో బీజేపీ 2 వందల సీట్లు సాధిస్తే..తాను తన విధుల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్‌కు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దేశం త్వరలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సేవల్ని కోల్పోనుందని బీజేపీ ( BJP ) నేత కైలాష్ విజయవర్గీయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సృష్టించబోయే సునామీలో టీఎంసీ నేతలంతా కొట్టుకుపోతారని అన్నారు. 

కైలాష్ విజయ వర్గీయ్ కౌంటర్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ప్రశాంత్ కిశోర్. 100 సీట్లు సాధించలేకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న పదవుల్నించి తప్పుకునే దమ్ముందా అని ఘాటుగా ప్రశ్నించారు. మొత్తానికి అటు అమిత్ షా..ఇటు ప్రశాంత్ కిశోర్ రాకతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణం హాట్ హాట్‌గా మారింది.

Also read: CBSE Board Exam 2021 schedule news: సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర మంత్రి క్లారిటీ

Trending News