Cop's Daughter Raped: దారుణం... పోలీస్ కూతురిపై బాయ్‌ఫ్రెండ్ హత్యాచారం...

Uttar Pradesh Cop's Daughter Raped: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ కూతురు హత్యాచారానికి గురైంది. బాయ్‌ఫ్రెండే ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 02:35 PM IST
  • యూపీలో దారుణ ఘటన
  • పోలీస్ కూతురిపై ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్యాచారం
  • అత్యాచారం జరిపి గొంతు నులిమి హత్య
  • ఆపై మృతదేహానికి నిప్పంటించిన నిందితుడు
Cop's Daughter Raped: దారుణం... పోలీస్ కూతురిపై బాయ్‌ఫ్రెండ్ హత్యాచారం...

Uttar Pradesh Cop's Daughter Raped: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. అదృశ్యమైన ఓ పోలీస్ కూతురు (20) దారుణ హత్యకు గురైంది. ఆగ్రా హైవే సమీపంలో కాలిపోతున్న స్థితిలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. యువతి బాయ్‌ఫ్రెండే ఆమె గొంతు నులిమి హత్య చేసి.. ఆపై మృతదేహానికి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు ముందు నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడైంది. యువతిని హత్య చేసేందుకు నిందితుడికి అతని తండ్రి సహకరించడం గమనార్హం.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... యూపీకి చెందిన ఓ పోలీస్ కూతురు (20) ఓ కాలేజీలో బీకామ్ చదువుతోంది. మే 30న ఉదయం 9.30గంటలకు కాలేజీకి వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత రెండు రోజులకు బుధవారం (జూన్ 1) ఆగ్రా హైవే సమీపంలో కాలిపోతున్న స్థితిలో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అక్కడ దొరికిన ఆధారాలతో ఆ మృతదేహం పోలీస్ కూతురిదేనని నిర్ధారించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆశిష్ తోమర్ (22) అనే యువకుడు ఆమెను హత్య చేసినట్లు వెల్లడైంది. యువతికి, అతనికి స్కూల్లో చదివే రోజుల నుంచే పరిచయం ఉందని గుర్తించారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కోసం ఇటీవల యువతి అతనిపై ఒత్తిడి పెంచిందని.. ఈ క్రమంలోనే అతను యువతిని హత్య చేశాడని నిర్ధారించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసినట్లు తేల్చారు. అనంతరం ఆమె మృతదేహానికి నిప్పంటించినట్లు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితుడి తండ్రి అతనికి సహకరించినట్లు గుర్తించారు. ఆశిష్‌తో పాటు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.  

Also Read: BJP Strategy: కమలనాథులకు ఆ ముచ్చట తీరుతుందా..? ప్రధాని మోదీ ఏమంటున్నారు..?

Also Read: Achyuthapuram Gas Leakage: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం... తప్పిన ముప్పు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News