Ayodhya: అయోధ్యలో అరుదైన ఘటన.. రామ్ లల్లా గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం ఏంచేసిందో తెలుసా..?

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగింది. వందల ఏళ్లుగా ఎదురుచూసిన ఘట్టం ఎట్టకేలకు జనవరి 22న బాలరాముడిని స్థాపించడంతో ముగిసింది. దేశమంతాట కూడా రామనామ స్మరణతో మార్మోగిపోయిందని చెప్పుకొవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 03:19 PM IST
  • Ram lalla idol: దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, భవ్య రామమందిరం ట్రస్ట్ నిర్వాహకులు కూడా పాల్గొన్నారు.
Ayodhya: అయోధ్యలో అరుదైన ఘటన.. రామ్  లల్లా గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం ఏంచేసిందో తెలుసా..?

Ram Janmabhoomi: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగింది. వందల ఏళ్లుగా ఎదురుచూసిన ఘట్టం ఎట్టకేలకు జనవరి 22న బాలరాముడిని స్థాపించడంతో ముగిసింది. దేశమంతాట కూడా రామనామ స్మరణతో మార్మోగిపోయిందని చెప్పుకొవచ్చు. అనేక ప్రాంతాలలో కుల, మతాలకు అతీతంగా మతసామరస్యం చాటే విధంగా ఉత్సవంలో పాల్గొన్నారు.  కాగా, అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రతిష్టాపన వేడుకకు అన్నిరంగాలకు చెందిన అతిరథ మహారథులు హజరయ్యారు. అదే విధంగా, ఇటు సామాన్య భక్తులు కూడా బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన వేడుకలో పాల్గోన్నారు.

దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, భవ్య రామమందిరం ట్రస్ట్ నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అయోధ్యలో కేంద్రం భద్రత దళాల ఆధ్వర్యంలో సెక్యురిటీని కట్టుదిట్టంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు.

అయితే... అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన తర్వాత అరుదైన ఘటన చోటు చేసుకుంది. హనుమంతుడు రాముడికి భక్తులలో అగ్రగణ్యుడిగా చెబుతుంటారు. ఎక్కడైతే రామనామం జపిస్తారో, శ్రీ రాముడి ఉత్సవం నిర్వహిస్తారో అక్కడికి హనుమంతుడు తప్పకుండా వస్తాడని పెద్దలు చెబుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన అయోధ్యలో చోటు చేసుకుంది.

పూర్తివివరాలు.. 

అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఒక రోజు తర్వాత అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న (మంగళవారం)సాయత్రం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక వానరం ఏకంగా గర్భగుడిలోకి ప్రవేశించింది. సాయంత్రం 5:50 గంటల సమయంలో ఇది జరిగినట్లు రామలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో ఎంతో మంది భక్తులు ఉన్న కూడా వానరం ఏమాత్రం భయపడకుండా రాముడి విగ్రహం దర్గరకు వెళ్లినట్టు సమాచారం.

కాసేపు బాలరాముడి విగ్రహం దగ్గరనే ఉండిపోయింది. దీంతో అక్కడున్న భక్తులు భక్తితో హనుమంతుడు రాముడి దర్శానానికి వచ్చాడంటూ కూడా గట్టిగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.  ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రత సిబ్బంది వానరంను బైటకు వెళ్లేలా చేశారు. రాంలాలాను చూసేందుకు హనుమంతుడే వచ్చాడని  శ్రీ రామ జన్మభూమి ఆలయం ట్రస్ట్ వానరం ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 

Read This: Ayodhya: భవ్యరామమందిరం ప్రారంభోత్సవం.. ముస్లిం ఫ్యామిలీ తమ బాలుడికి ఏంపేరు పెట్టారో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News