5 Masalas prepare at home: గరం మసాలా, ఛాట్ మసాలా, చికెన్ మసాలా.. ఈ 5 మసాలాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

5 Masala prepare at home: ఇండియన్ మసాలాల్లో ఈథైలిన్ ఆక్సైడ్ (ETO) స్థాయికి మించి ఉండటంతో సింగపూర్, హాంకాంగ్ దేశాలు కొన్ని మసాలాను వారి దేశంలో నిషేధించాయి. ఇవి క్యాన్సర్ కు కారణమవుతాయని ఇటీవలె వివాదాస్పదంగా మారింది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 27, 2024, 01:59 PM IST
5 Masalas prepare at home: గరం మసాలా, ఛాట్ మసాలా, చికెన్ మసాలా.. ఈ 5 మసాలాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

5 Masala prepare at home: ఇండియన్ మసాలాల్లో ఈథైలిన్ ఆక్సైడ్ (ETO) స్థాయికి మించి ఉండటంతో సింగపూర్, హాంకాంగ్ దేశాలు కొన్ని మసాలాను వారి దేశంలో నిషేధించాయి. ఇవి క్యాన్సర్ కు కారణమవుతాయని ఇటీవలె వివాదాస్పదంగా మారింది. మన దేశంలో మసాలాలను విపరీతంగా వినియోగిస్తారు. ఇవి ప్రతి వంటింటి కిచెన్లో అందుబాటులో ఉంటాయి. ఇవి కూరలకు మంచి రుచిని అందిస్తాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

గరం మసాలా..
ఈ గరం మసాలా మన భారతీయ వంటగదుల్లో తప్పకుండా ఉంటుంది. దీన్ని కొన్ని మసాలా దినుసులను బ్లెండ్‌ చేసి తయారు చేస్తారు. ముఖ్యంగా జీలకర్ర, యాలకులు, లవంగాలు, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, నట్‌ మెగ్ వేసి తయారు చేస్తారు. దీన్ని హాట్‌ స్పైస్‌ మిక్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని కూడా పుట్టిస్తాయి. వెజ్‌, నాన్ వెజ్ వంటకాల్లో గరం మసాలాను వాడతారు.ఈ గరం మసాలా తయారీకి ముందుగా ఓ ప్యాన్ తీసుకుని అందులో మసాలా దినుసులను అన్నిటినీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటి నుంచి మంచి సువాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత సన్నని పౌడర్ తయారు చేసుకోవాలి. దీన్ని ఓ గాలిచొరబడని కంటైనర్‌లో వేసుకుని నిల్వ చేసుకోవాలి.

సాంబర్ మసాలా..
సాంబర్ మసాలా సౌత్‌ ఇండియాలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది లేకపోతే సాంబర్‌కు రుచి రాదు. సాంబర్‌ను ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు, కారం వేసి తయారు చేస్తారు. వీటిని ఓ ప్యాన్‌ లో తీసుకుని దోరగా వేయించి నిల్వ చేసుకోవడమే. ఇందులో కారం, పసుపు పొడి తయారైనాక కలపాలి. సాంబర్ మసాలా 3 నెలలపాటు నిల్వ ఉంటుంది.

ఛాట్‌ మసాలా..
పుల్లగా ఉండే ఛాట్‌ మసాలా వివిధ రకాల స్ట్రీట్‌ ఫుడ్స్ వినియోగిస్తారు. ఛాట్‌, టిక్కా, చట్నీల్లోకి ఛాట్ మసాలా వాడతారు. దీన్ని ఎండిన మామిడితో తయారు చేస్తారు. ఇందులో జీలకర్ర, నల్ల ఉప్పు, ధనియాల పొడి, శొంఠి, నల్ల మిరియాలు, ఇంగువ, ఆమ్చూర్‌ వేసి తయారు చేస్తారు. ఈ మసాలా తయారీకి ఆంచూర్ కాకుండా మిగతా మసాలాను బాగా వేయించి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఓ 3 నెలలపాటు నిల్వ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?

తందూరీ మసాలా..
తందూరీ మసాలా చికెన్‌, ఇతర తందూరీ వంటల్లో వినియోగిస్తారు. దీన్ని ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, యాలకులు, నట్‌ మెగ్‌, మెంతులు, కారం పొడి వేసి తయారు చేస్తారు.తందూరీ మసాలా తయారీకి ఈ మసాలాలు ప్యాన్లో వేసి వేయించుకుని తయారు చేసుకోవాలి. మెత్తగా పొడిచేసుకుని ఓ ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. మూడు నెలల పాటు ఈ తందూరీ మసాలా నిల్వ ఉంటుంది.

ఇదీ చదవండి: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

బిర్యానీ మసాలా..
బిర్యానీ అంటేనే ఎంతో ఇష్టం అందరికీ. దీనికి ఆ సువాసనను ఇచ్చేది బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, లవంగం, యాలకులు, స్టార్ అనైజ్, నట్‌మెగ్‌ వేసుకుని తయారు చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్‌ చేసుకుని బ్లెండ్‌ చేయాలి. ఏ మసాలాల్లోకి అయినా నాణ్యమైన మసాలా దినుసులు కొనుగోలు చేయండి. మీ రుచికి సరిపడా వాటి క్వాంటిటీని మార్చుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News