Banana 6 Benefits: అరటి పండుతో ఆరోగ్యం.. ఇలా తింటే 6 అద్భుతమైన బెనిఫిట్స్..

Banana 6 Benefits: అరటి పళ్ళు రుచి తీయగా సహజ సిద్ధంగా ఉంటుంది. సాధారణంగా అరటి పండు ధరలు కూడా తక్కువ ధరలోనే ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఇష్టపడి తింటారు.

Written by - Renuka Godugu | Last Updated : May 15, 2024, 09:05 AM IST
Banana 6 Benefits: అరటి పండుతో ఆరోగ్యం.. ఇలా తింటే 6 అద్భుతమైన బెనిఫిట్స్..

Banana 6 Benefits: అరటి పళ్ళు రుచి తీయగా సహజ సిద్ధంగా ఉంటుంది. సాధారణంగా అరటి పండు ధరలు కూడా తక్కువ ధరలోనే ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఇష్టపడి తింటారు. అయితే అరటి పండ్లను మనం సౌందర్య ఉత్పత్తిలో కూడా వినియోగిస్తారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన హెయిర్ కేర్ రొటీన్ లో అరటిపండు చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. మన జుట్టు నేచురల్‌గా మాయిశ్చర్‌గా ఉంచి బలంగా మారుస్తుంది. 

ముఖ్యంగా మన హెయిర్ కేర్ రొటీన్ లో అరటి పండును చేర్చుకోవడం వల్ల జుట్టుకు కావలసిన పోషణ లభిస్తుంది. అరటిపండు ఉన్న షాంపూలు కండిషనర్లు అందుబాటులో ఉంటాయి. వీటిరి  హెయిర్‌కు వేసుకోవడం వల్ల మనం జుట్టు సహజసిద్ధంగా మెరుస్తుంది. ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.

అరటిపళ్లతో 6 ప్రయోజనాలు..
జుట్టుకు బలం.. 
అరటి పండ్లు లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి, పొటాషియన్, ఖనిజాలు ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలంగా మారుతాయి అంతేకాదు స్ల్పిట్‌ ఎండ్స్‌ సమస్య రాకుండా కాపాడుతుంది. దీంతో జుట్టు బలంగా మారుతుంది.

హైడ్రేషన్..
అరటిపండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జుట్టుకు కావాల్సిన హైడ్రేషన్ లభిస్తుంది. దీంతో జుట్టు సిల్కీగా స్మూత్ గా మారుతుంది. నాచురల్ గా జుట్టు హైడ్రేషన్ గా ఉంటుంది. కాబట్టి ఫ్రీజ్ హెయిర్ సమస్య ఉండదు.

బయోటిన్ పుష్కలం..
అరటి పండులో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు బలంగా మారడానికి ఎంతో సహకరిస్తుంది. తరచుగా అరటిపండుతో చేసిన హెయిర్ మాస్కులు వినియోగించడం వల్ల మన జుట్టుకు కావలసిన పోషణ లభించి పొడుగ్గా పెరిగి బలంగా మారుతుంది.

ఇదీ చదవండి: రోజ్మెరీతో మృదువైన, మెరిసే ముఖం మీ సొంతం.. ఇలా అప్లై చేయండి..

సహజంగా మెరుస్తుంది..
అరటి పండులో సహజ సిద్ధమైన నూనెలు ఉంటాయి. ఇది మన జుట్టుకు మంచి గ్లోసీ లుక్ ని అందిస్తాయి. అరటిపండుతో తయారు చేసిన హెయిర్ మాస్కులు వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

కుదుళ్ల నుంచి..
మాయిశ్చరైజింగ్ గుణాలు కలిగిన అరటిపండును మన హెయిర్ మాస్కులు వినియోగించడం వల్ల ఇందులో ఉండే కూలింగ్ గుణాలు కుదుళ్ల నుంచి బలాన్ని ఇస్తాయి. కుదుళ్ళపై ఉండే దురదను తగ్గించి డాండ్రఫ్ రాకుండా నివారిస్తుంది. దీంతో కుదుళ్ల నుంచి జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

ఇదీ చదవండి: రోజ్‌ వాటర్‌ మీ ముఖానికి అప్లై చేస్తే మచ్చలేని చందమామలా మెరిసిపోతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News