Copper Water Uses: రోజూ రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!

 Copper Water Benefits: రాగి నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది వల్ల కొన్నిఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2024, 01:40 PM IST
Copper Water Uses: రోజూ రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Copper Water Benefits: ఆయుర్వేద నిపుణులు ప్రకారం, రాగి పాత్రలో నిల్వ చేసిన నీరుని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది శరీరంలో అనేక ముఖ్యమైన పనులను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. రాగ్రి పాత్రలో ఉండే నీరు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:

ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలోని నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీరు జీర్ణం కావడానికి సహాయపడే ఎంజైమ్‌లను ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.  ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఈ రాగి నీరు తీసుకోవడం చాలామంచిది. 

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. కానీ రాగి పాత్రలో నీరు తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడతుంది.  ఈ రాగి పాత్రలో నీరు తీసుకోవడం వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. రాగి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. ఎలాంటి మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కలగకుండా ఉంటాయి. 

మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, చేతి , మెద, ఎమకల నొప్పిలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు రాగి నీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వాపులు తగ్గుతాయి. రాగి నీరు తీసుకోవడం వల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. మహిళలకు ఈ రాగి నీరు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 

రాగి నీరు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సమస్యలకు రాకుండా సహాయపడుతుంది. రాగి మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. నాడీ సంకేతాల ప్రసారానికి సహాయపడుతుంది. 

రాగి పాత్రలో నీరు తాగేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు:

* ఎల్లప్పుడూ శుభ్రమైన, పగులలేని రాగి పాత్రలను ఉపయోగించండి. 

* రాగి పాత్రలో నీటిని 24 గంటలకు మించి నిల్వ చేయవద్దు
 
* రోజుకు 3 లీటర్లకు మించి రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగవద్దు.

* గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు, చిన్న పిల్లలు రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తీసుకొనే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News