Women Health Tips: ఈ గింజలు తింటే పీరియడ్స్, మెనోపాజ్ సమయంలో సమస్యలకు చెక్, రొమ్ము కేన్సర్ కూడా

Women Health Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలు, గింజల్లో అద్భుతమైన పోషక విలువలున్నాయి. అందుకే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో దాదాపు అన్ని ఔషదాలు ప్రకృతిలో లభించే పదార్ధాలతోనే తయారౌతుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2023, 07:51 PM IST
Women Health Tips: ఈ గింజలు తింటే పీరియడ్స్, మెనోపాజ్ సమయంలో సమస్యలకు చెక్, రొమ్ము కేన్సర్ కూడా

Women Health Tips: పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. కారణం నిర్ణీత వయస్సు నుంచి నిర్ధారిత వయస్సు దాటేవరకూ ఉండే హార్మోన్ సమస్య. హార్మోన్ ఉత్పత్తిలో అసమతుల్యత కారణంగా మహిళలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. 

ముఖ్యంగా మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే నెలసరి ఓ ప్రధానమైన సమస్య. ఆ తరువాత మహిళలకు 45 ఏళ్లు దాటాక వచ్చే మెనోపాజ్. అంటే నెలసరి ఆగిపోయే వయస్సు. ఈ రెండు దశల్లోనూ హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళలు చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలకు అవిశె గింజలు అంటే ఫ్లక్స్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు అవిశె గింజల్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను నిర్మూలించవచ్చు. అవిశె గింజల్లో ఫైటో ఈస్ట్రోజెనిక్ లక్షణాలు కలిగిన లిగ్నాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల్లో హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఫలితంగా చాలా సమస్యలు దూరమౌతాయి. 

సాధారణంగా మహిళల్లో 45-50 ఏళ్ల వయస్సులో రుతుక్రమం ఆగిపోతుంది. దీనినే మెనోపాజ్ అంటారు. ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా వికారం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి.  అవిశె గింజల్ని డైట్‌లో భాగంగా చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ఈస్ట్రోజెనిక్, యాంటీ ఈస్ట్రోజెనిక్ ప్రబావం కారణంగా శరీరంలో అంతర్గతంగా జరిగే ఈస్ట్రోజెన్ యాక్టివిటీని నియంత్రించవచ్చు. ఫలితంగా హార్మోన్ స్థాయి బ్యాలెన్స్ అవుతుంది. అవిశె గింజల్లోని లిగ్నైన్స్ సమ్మేళనాలు మహిళల శరీరంలోని హార్మోన్ల జీవక్రియ అంటే మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువైతే నియంత్రించేందుకు దోహదపడతాయి. 

ఇక అన్నింటికంటే ముఖ్యంగా మహిళల్లో అత్యధికంగా కన్పించే రొమ్ము కేన్సర్ ముప్పు తగ్గించడంలో అవిశె గింజలు చాలా కీలకంగా ఉపయోగపడతాయంటారు. బ్రస్ట్ కణజాలంపై రక్షణకవచంగా ఏర్పడతాయి. మరోవైపు బరువు తగ్గించేందుకు అవిశె గింజలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

అవిశె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం నిజంగా ఓ వరమే అని చెప్పాలి. మలబద్ధకంతో బాధపడేవాళ్లు అవిశె గింజలు తీసుకుంటే చాలావరకూ ఉపశమనం లభిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకూ తొలగిపోతాయి. 

Also read: Honey Benefits: దగ్గు, కఫం సీజనల్ వ్యాధులకు ఇదే అద్భుత పరిష్కారం, తేనెతో లాభాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News