Reduce Cholesterol : తొడల్లో నొప్పిగా ఉందా.. వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాల్సిందే..

High Cholesterol Symptoms : మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే చాలా అనారోగ్యాలు వస్తాయి. కానీ వాటి నుంచి మనం దూరంగా ఉండటానికి చెడు కొలెస్ట్రాల్ కి కూడా దూరంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు మన కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకుంటూ ఉండాలి. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండానే మనం తెలుసుకోవచ్చు. మన శరీరం మనకి ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని బట్టి మనం కొలెస్ట్రాల్ పెరిగింది అని తెలుసుకోవచ్చు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 23, 2024, 02:45 PM IST
Reduce Cholesterol : తొడల్లో నొప్పిగా ఉందా.. వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాల్సిందే..

High Cholesterol : ప్రస్తుతం మన ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా చిన్నా పెద్ద వయసు తేడా లేకుండా చాలామందికి అధిక కొలెస్ట్రాల్ వస్తుంది. కానీ అది శరీరానికి ఎంతో హానికరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ ఒకటి ఎక్కువగా ఉంటే మన శరీరం ఎన్నో రకాల వ్యాధులకు గురవుతూ ఉంటుంది. మధుమేహం, హార్ట్ ఎటాక్ వంటివి కూడా కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 

కొన్నిసార్లు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కారణంగా మరణం కూడా సంభవించవచ్చు. అందుకే మన బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తో అనే బ్లడ్ టెస్ట్ తో వైద్యులు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నిర్ధారిస్తారు. ఒకవేళ పరీక్షించుకోవడం కుదరకపోయినా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగింది అనే విషయాన్ని మనకి మనమే తెలుసుకోవచ్చు.

దానికోసం మన శరీరంలో కనిపించే ముందస్తు లక్షణాలను మనం పరిశీలించుకోవాలి. బాడీలో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయినప్పుడు ముఖ్యంగా శరీరంలో మూడు అవయవాల్లో నొప్పిగా ఉంటుంది. తొడలు, తుంటి, కాళ్ల కండరాలు ఈ మూడిట్లో ఎక్కడ నొప్పి కలిగినా అది చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువ ఉంది అనే విషయాన్ని సగం నిర్ధారించినట్టే.

కొన్ని సందర్భాల్లో కాళ్ళ తిమ్మిర్లు కూడా ఒక సంకేతం గా చెప్పుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తం మన గుండెకు లేదా ఇతర అవయవాలకు ప్రయాణించటం కష్టతరంగా మారుతుంది. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందకపోవడం వల్ల ఆ అవయవాల్లో నొప్పి వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని పిలుస్తారు.

ఈ లక్షణాలు గనక మనలో కనిపిస్తే వెంటనే మనం సంబంధిత పరీక్షలు చేయించుకొని వైద్యున్ని కలవాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పిగా ఉండి మెట్లు సరిగా ఎక్కలేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. కొన్నిసార్లు అరికాళ్ళల్లో నొప్పి తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. కాళ్ల గోర్లల్లో కాసఫ్ పసుపు రంగులోకి మారడం, కాళ్ళు కూడా వాచినట్లు అనిపిస్తూ ఉండడం. ఇవి కూడా కొలెస్ట్రాల్ కే సంకేతాలే.

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News