Summer Vacations: ఇండియాలో టాప్ 5 వేసవి టూరిజం డెస్టినేషన్లు ఇవే, ఎంత ఖర్చవుతుంది

Summer Vacations: వేసవి సెలవుల్లో హాయిగా...ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా..వేసవి సెలవుల్లో సేద తీరే ఇండియాలోని టాప్ 5 బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2022, 08:52 PM IST
 Summer Vacations: ఇండియాలో టాప్ 5 వేసవి టూరిజం డెస్టినేషన్లు ఇవే, ఎంత ఖర్చవుతుంది

Summer Vacations: వేసవి సెలవుల్లో హాయిగా...ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా..వేసవి సెలవుల్లో సేద తీరే ఇండియాలోని టాప్ 5 బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాం..

సమ్మర్ వెకేషన్ లేదా లాంగ్‌టూర్ ప్లాన్ చేస్తన్నారా..అయితే ఇండియాలోని ఈ ఆరు ప్రాంతాలు మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్స్ కానున్నాయి. వేసవి సెలవుల్లో ప్రశాంతంగా, ఆహ్లాదంగా, చల్లగా గడిపేందుకు ఫ్యామిలీ టూర్ కోసం ఆలోచిస్తుంటే..ఇవే మంచి టూరిస్ట్ ప్రాంతాలు. ఇండియాలోని ఈ టాప్  5 టూరిస్ట్ ప్లేసెస్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిది ఊటీ. ఇద్దరికి 25 వేల నుంచి 40 వేల వరకూ ఖర్చు కావచ్చు. ఊటీ వెళ్లేందుకు కోయంబత్తూర్ వరకు ఫ్లైట్‌లో వెళ్లవచ్చు. అదే ట్రైన్ ద్వారా వెళ్లాలనుకుంటే మాత్రం మెట్టుపాళ్యం స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఊటీ సరస్సు, దొడ్డబెట్ట, రోజ్‌గార్డెన్, ఏవలాంచ్ లేక్ వంటివి ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు.

Ooty as summer destination
రెండవ ప్రముఖ పర్యాట కేంద్రం మున్నార్. ఇద్దరికి అయ్యే ఖర్చు 35 వేల నుంచి 50 వేల వరకూ ఉంటుంది. మున్నార్ వెళ్లాలంటే..అలువా రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన పట్టణాల్నించి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. మున్నార్‌లో ప్రముఖ సందర్శనీయ పర్యాటక ప్రాంతాలు నేషనల్ పార్క్, అనాముదీ మౌంటెయిన్, బ్యాక్ వాటర్స్, అట్టకల్ వాటర్ ఫాల్స్ ముఖ్యమైనవి.

Munnar as summer destination

మూడవది డార్జిలింగ్. ప్రస్తుతం అక్కడ మంచి వాతావరణం, అద్భుతమైన దృశ్యాలుంటాయి. ఇద్దరికి 30 వేల నుంచి 50 వేల రూపాయలవరకూ ఖర్చవుతుంది. డార్జిలింగ్ వెళ్లాలంటే బాగ్దోగ్రా ఎయిర్‌పోర్ట్ వరకూ ఫ్లైట్‌లో వెళ్లవచ్చు. డార్జిలింగ్ వెళితే టాయ్ ట్రైన్ ఎక్కడం మర్చిపోవద్దు. ఇది కాకుండా టైగర్ హిల్, జూలాజికల్ పార్క్ వంటివి ఇంకా చాలా ఉన్నాయి.

Darzeeling as summer destination

ఇక నాలుగవది కులూ మనాలీ. ఇద్దరికి 20 వేల నుంచి 35 వేలవరకూ ఖర్చవుతుంది. కులూమనాలీ వెళ్లాలంటే బస్సు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా భుంటార్ ఎయిర్‌పోర్ట్ వరకూ ఫ్లైట్ ద్వారా వెళ్లవచ్చు. ఇక్కడున్న ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు రోహ్‌తంగ్ వ్యాలీ, భుంగ్ లేక్, ఇగ్లూ స్టే ప్రధానమైనవి.

Kullu Manali as summer destination

అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్. ఇద్దరికి 40 వేల నుంచి 80 వేలవరకూ ఖర్చవుతుంది. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరవాత పోర్ట్ బ్లెయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకూ వెళ్లవచ్చు. అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్‌లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు రాస్ ఐల్యాండ్, వైపర్ ఐల్యాండ్ పోర్ట్ బ్లెయిర్, ఎలిఫెంట్ బీచ్, నార్త్ బే ప్రముఖమైనవి.

Andaman nikabar islands as summer destination

Also read: EPF Benefits: మీ పీఎఫ్ ఎక్కౌంట్‌కు..ఈ దరఖాస్తు సమర్పించండి.. 7 లక్షల ప్రయోజనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News