Vitamin E capsules: జుట్టుకు విటమిన్ E క్యాప్సిల్స్ వాడుతున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

Vitamin E capsules: జుట్టుకు విటమిన్ E క్యాప్సిల్స్ ను తరచుగా వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిని వినియోగించే క్రమంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనేక జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 12, 2024, 05:11 PM IST
Vitamin E capsules: జుట్టుకు విటమిన్ E క్యాప్సిల్స్ వాడుతున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

 

Vitamin E capsules: ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు తమ జుట్టును ఆరోగ్యంగా దృఢంగా పొడవుగా మార్చుకోవడానికి మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ వారు అనుకున్న ఫలితాలు పొందలేకపోతున్నారు. నిజానికి కొంతమంది రసాయనాలతో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్ వినియోగించడం వల్ల అనేక ఇబ్బందుల బారిన పడుతున్నారు. అయితే ఇకనుంచి ఖరీదైన ప్రొడక్ట్స్ వినియోగించినక్కర్లేదు. అమ్మాయిలు తమ జుట్టును ఒత్తుగా ఆరోగ్యంగా చేసుకోవడానికి ప్రతిరోజు కేవలం విటమిన్ E క్యాప్సిల్స్ వినియోగించడం చాలా మంచిది. ఇందులో జుట్టుకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ క్యాప్సిల్స్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ప్రస్తుతం చాలామంది విటమిన్ E క్యాప్సిల్స్‌ను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. నిజానికి ఇలా వినియోగించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా వినియోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.

విటమిన్ ఇ క్యాప్సూల్స్ అతిగా వినియోగించడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను అతిగా వాడడం లేదా జుట్టుకు నేరుగా నేరుగా అప్లై చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నేరుగా అప్లై చేయడం వల్ల దురద మంట వంటి సమస్యలు వస్తాయి. దీనికి కారణంగా వెంట్రుకలు రాలిపోయే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా కొంతమందిలో జుట్టు పెరుగుదల ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మరికొంతమందిలోనైతే ఈ క్యాప్సిల్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల అలర్జీతో పాటు తలపై వాపు వంటి సమస్యలు కూడా రావచ్చు.

 
ఈ క్యాప్సిల్స్‌ను ఎలా అప్లై చేయాలి?
జుట్టుకు విటమిన్ ఇ క్యాప్సూల్‌ను అప్లై అప్లై చేసేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఈ క్యాప్సిల్స్‌ను వాడాలి అనుకుంటున్నారు. వీటిని ముందుగా కొబ్బరి నూనెలో మిక్స్ చేసి ఆ ఆయిల్‌ను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత దాదాపు పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తేనే విటమిన్ ఇ క్యాప్సూల్స్ వల్ల కలిగే లాభాలను పొందగలుగుతారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

విటమిన్ ఇ క్యాప్సూల్స్ ప్రయోజనాలు:

విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల జుట్టుకు బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొన్ని గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుకు తగిన విటమిన్స్ అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వెంట్రుకలకు సహజమైన రంగును అందించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే చాలామందిలో జుట్టు చిట్లిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్య నుంచి కూడా సులభంగా E క్యాప్సిల్స్ ఉపశమనం కలిగిస్తాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News