పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం !!

పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు

Last Updated : Jun 18, 2019, 10:18 PM IST
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం !!

ఉపాధి లేక పొట్టకూటి కోసం మలేసియాలో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు...ఓ భవన నిర్మాణం పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు వదిలాడు. మృతదేహం బుధవారం భారత్ కు తరలిస్తామని మలేసియాలోని భారత హైకమిషన్ అధికారులు తెలిపారు.

మృతుడి బంధువుల కథనం ప్రకారం నిజామాబాద్ లో ఉన్నప్పుడు అహ్మద్ ఆటో నడుపుకుంటూ జీవనం గడిపేవాడు..కుటుంబ అవసరాల నిమిత్తం సంపాదన కోసం మలేసియా వెళ్లాడని తెలిపారు. మలేసియాలో ఉద్యోగం కోసం ఏజెంట్లకు చెల్లించడానికి అహ్మద్ లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని బంధువులు వెల్లడించారు. అహ్మద్ మరణంతో అతని కుటుంబం దిక్కతోచని స్థితిలో వెళ్లిపోయిందని..ప్రభుత్వం అతని కుటుంబానికి ఆదుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది

Trending News