Meenakshi Chaudhary: బాపుబొమ్మల మీనాక్షి చౌదరి.. ఎర్రటి చీరలో చూడచక్కగా

Meenakshi Chaudhary Instagram Photos: మీనాక్షి చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా తన సినిమాల కన్నా కూడా తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

1 /4

2018లో ఫెమినా మిస్ ఇండియా అవార్డు అందుకున్న నటి మీనాక్షి చౌదరి. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా నిలిచింది ఈ హీరోయిన్. కాగా కరోనా టైం లో సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చుట వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  

2 /4

ఆ తరువాత రవితేజ ఖిలాడి సినిమాలో కనిపించి మెప్పించింది. అడివి శేష్ హీరోగా చేసిన హిట్: ది సెకండ్ కేస్ సినిమాతో తన మొదటి కమర్షియల్ సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్.  

3 /4

ఇక ఆ తరువాత ఏకంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో చాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో మీనాక్షి కనిపించేది చాలా తక్కువ సేపు అయినప్పటికీ.. ఆ తక్ ఆకట్టుకుంది ఈ హీరోయిన్.  

4 /4

తమిళ సినిమాలలో సైతం ప్రస్తుతానికి అవకాశాలు అందుకుంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో మీనాక్షి బాపు బొమ్మలా ఎంతో అందంగా ఎర్ర చీరలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.