YS Vijayamma: జగన్ కు బిగ్ షాక్.. వైఎస్ షర్మిలను గెలిపించాలని విజయమ్మ వీడియో రిలీజ్..


YS Vijayamma: ఎన్నికల వేళ జగన్ కు ఆయన తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి తన నమస్కారాలు అంటూ పలకరించారు. కడపలో ఎంపీగా బరిలో నిలబడిన తన బిడ్డ వైఎస్ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించాలని అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేశారు.
 

1 /6

ఎన్నికలు మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో నాయకులు ప్రచార హోరును పెంచారు. దీనిలో  భాగంగా ఏపీలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారంలో మాట్లాడుతూ.. తన తండ్రికి, దివంగత నేత వైఎస్సార్ సోదరుడి లాంటి వాడంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు.  

2 /6

తన సోదరి వైఎస్ షర్మిలను కడప నుంచి భారీ మెజార్టీతో గెలిపించి, లోక్ సభకు పంపాలని కోరారు. అంతేకాకుండా.. వైఎస్సార్ చేసిన పాదయాత్రను ఆదర్శంగా తీసుకుని, భారత్ జోడోయాత్రచేపట్టినట్లు తెలిపారు. ఈక్రమంలోనే మోదీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.  

3 /6

ఇదిలా ఉండగా.. అమెరికా నుంచి సీఎం జగన్ తల్లి విజయమ్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది సీఎం జగన్ కు బిగ్ ట్విస్ట్ అని చెప్పుకొవర్చు. దివంగతన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతిఒక్కరికి తన నమస్కారాలు తెలియజేశారు.కడప ప్రజలకు తన విన్నపం అంటూ విజయమ్మ.. కడప ఎంపీ ఎన్నికల బరిలో తన కూతురు షర్మిల నిలండిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాని కోరారు.

4 /6

వైఎస్ షర్మిల గెలిస్తే, వైఎస్సార్ లాగా మంచి చేస్తుందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తుదంటూ  విజయమ్మ అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఎన్నికలు ప్రచారం ముగుస్తున్న కొన్ని గంటలకు ముందు వైఎస్ విజయమ్మ కూతురు షర్మిల ను సపోర్ట్ చేస్తు వీడియోరిలీజ్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

5 /6

ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ అనేక బహిరంగ సభలలో తన ఇద్దరుచెల్లెళ్లు టీడీపీ, కాంగ్రెస్ లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని, పదవుల కోసం ఎన్నికల బరిలో నిలబడ్డారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా షర్మిలకు పదవులు ఆశచూపి, ఓట్లు చీల్చేకుట్రలకు తెరదీశారన్నారు.

6 /6

మరోవైపు వైఎస్ షర్మిల తన తండ్రి పేరును ఎఫైఐఆర్ లో చేర్చింది సీఎం జగన్ అన్ని అన్నారు. లాయర్ పొన్నవోలు సుధాకర్ తో కోర్టులలో పిటిషన్ లు వేయించారని విమర్శించారు. అందుకే ఆయనకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కట్టబెట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారం ముగింపు వేళ వైఎస్ విజయమ్మ రిలీజ్ చేసిన వీడియో మాత్రం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.