Skin Care in Summer: వేసవిలో చర్మాన్ని దురద, ర్యాషెస్ నుంచి ఎలా సంరక్షించుకోవాలి

ఎండాకాలంలో సహజంగానే చర్మ సంబంధిత సమస్యలు పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఘమోరియా, రెడ్ ర్యాషెస్, దురద, కురుపులు , చెమటకాయలు వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే హైజీనిక్ అవసరం.

Skin Care in Summer: ఎండాకాలంలో సహజంగానే చర్మ సంబంధిత సమస్యలు పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఘమోరియా, రెడ్ ర్యాషెస్, దురద, కురుపులు , చెమటకాయలు వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే హైజీనిక్ అవసరం.

1 /5

వేప వేప నీటితో స్నానం చేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే వేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. 

2 /5

తులసి ఆకులు తులసి ఆకుల్లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. 

3 /5

ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా దురద, ర్యాషెస్, చర్మ సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు స్కిన్ ఇన్‌ఫెక్షన్‌ను దూరం చేస్తాయి. చెమట కారణంగా తలెత్తే దురద వంటి సమస్యలు దూరమౌతాయి.

4 /5

అల్లోవెరా అల్లోవెరా ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మ సంబంధిత సమస్యల్నించి రక్షణ కలుగుతుంది. చర్మం, కేశాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ రాత్రి వేళ ముఖానికి రాసుకుంటే మంచిది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

5 /5

కొబ్బరి నూనె వేసవి కాలంలో ఎప్పుడూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా చెమట కారణంగా రెడ్ ర్యాషెస్, దురద, చెమట కాయల సమస్యలుంటాయి. కొబ్బరి నూనె ఈ సమస్యలకు అద్భుత పరిష్కారం