IPL Records: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యుత్తమ రికార్డులు ఇవే

ఐపీఎల్ 2024లో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి మ్యాచ్ రోజుకో చరిత్ర సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. అత్యధిక పరుగుల రికార్డులు నమోదవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అత్యధిక పరుగులు చేసి తన రికార్డు తానే సృష్టించింది. 

IPL Records: ఐపీఎల్ 2024లో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి మ్యాచ్ రోజుకో చరిత్ర సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. అత్యధిక పరుగుల రికార్డులు నమోదవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అత్యధిక పరుగులు చేసి తన రికార్డు తానే సృష్టించింది. 

1 /4

కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఐపీఎల్ అద్భుత జట్లలో ఒకటి. కేకేఆర్ రికార్డు ఇంకా బ్రేక్ కాలేదు. కేకేఆర్ 2014లో వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది.  ఆ తరువాత 2015 సీజన్ ప్రారంభంలో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. 

2 /4

ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్ రికార్డ్ అల్జారీ జోసెఫ్ పేరు మీద ఉంది. ముంబై ఇండియన్స్ తరపున అడిన ఆల్జారీ జోసెఫ్ 2019లో కేవలం 3.4 ఓవర్లలో ఒక మెయిడెన్ చేసి 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేసర్ తన్వీర్ సోహెల్ పేరు మీద ఉంది. 2008లో 4 ఓవర్లలో 14 పరగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

3 /4

ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ చాలా రికార్డులు నెలకొల్పాడు. ఆ రికార్డులు ఇప్పటికీ బ్రేక్ కాలేదు. 30 బంతుల్లో సెంచరీ రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇది. రెండవ స్థానంలో యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ ఉంది. 

4 /4

ఐపీఎల్‌లో మొదటి స్థానంలో విస్ఫోటక క్రికెటర్ క్రిస్ గేల్ పెరు చెప్పవచ్చు. అతని ఆటంటే ఇప్పుడు కూడా అందరికీ క్రేజ్ ఎక్కువ. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ తరపున ఆడుతూ పూణే వారియర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 66 బంతుల్లో  17 సిక్సర్లు, 13 బౌండరీలతో 175 పరగులు చేశాడు.