Janhvi Kapoor: జాన్వీ కపూర్ పేరు వెనక ఉన్న సీక్రెట్ ఇదే.. మొత్తం గుట్టు విప్పేసిన శ్రీదేవి తనయ..

Jahnvi Kapoor Instagram Pics: అతిలోకసుందరి శ్రీదేవి తనయగా  సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో తల్లి రూట్లోనే  దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా తనకు జాన్వీ అనే పేరు పెట్టడం వెనక ఉన్న అసలు రహాస్యాన్ని బయటపెట్టింది. 

1 /8

జాన్వీ కపూర్.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తోంది.  అటు ఎన్టీఆర్ సినిమాలో యాక్ట్ చేస్తూనే రామ్ చరణ్‌ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసింది.

2 /8

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీపూర్. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. హిందీలో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీతో పలకరించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

3 /8

ఇక తనకు జాన్వీ పేరు పెట్టడం వెనక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించింది. 1997లో మా నాన్న బోనీ కపూర్.. తల్లి శ్రీదేవి, బాబాయ్ అనిల్ కపూర్‌తో 'జుదాయి' సినిమా నిర్మించారు. అందులో ఊర్మిళ మరో కీలక పాత్రలో నటించారు. అందులో ఆమె పేరు జాన్వీ.

4 /8

అపుడే శ్రీదేవి, బోనీ కపూర్‌లు తమకు పుట్టబోయే బిడ్డకు జాన్వీ పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టు చెప్పింది. ఇక తన తల్లి శ్రీదేవికి తాను డాక్టర్ చదవాలనే కోరిక ఉండేదట. చదువులో వీక్ కాబట్టి.. తల్లి బాటలోనే యాక్ట్రెస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను.

5 /8

జాన్వీ కపూర్ బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే.. తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

6 /8

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరక్కుతోంది.

7 /8

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది.

8 /8

ఇక వేళ పెళ్లి చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటాను. నా పెళ్లి కాంచీవరం జరీ చీర కట్టుకుంటాను. అంతేకాదు తన పెళ్లిలో దక్షిణాది వంటకాలు ఉండాల్సిందే అని చెబుతోంది జాన్వీ కపూర్.