Mangoes Eating Tips: మామిడి పండ్లను మీరు కూడా అలాగే తింటారా ?

పంచదారలా, తేనేలూరే తియ్యటి మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే మామిడి పండ్లు తినడంలోనూ కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయట. ఎలా పడితే అలా మామిడి పండ్లు తింటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇదిగో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.

  • May 10, 2023, 00:38 AM IST

Mango Eating Tips: పంచదారలా, తేనేలూరే తియ్యటి మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే మామిడి పండ్లు తినడంలోనూ కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయట. ఎలా పడితే అలా మామిడి పండ్లు తింటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇదిగో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.

1 /5

How to Eat Mangoes: వేసవి సీజన్ రాగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది మామిడి కాయలే. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారు ఉంటారా చెప్పండి. అందులోనూ మామిడి పండ్లలో ఉన్నన్ని రకాలు కూడా మరే ఇతర పండ్లలో ఉండవేమో.

2 /5

How to Eat Mangoes: మామిడి పండ్లను నేరుగా తిన్నట్టయితే.. అవి పండించడానికి ఉపయోగించిన రసాయనాల ప్రభావం అలాగే ఉంటుందట. అలా కాకుండా వాటిని తినడానికి ముందు కొంతసేపు నీళ్లలో ఉంచడం వల్ల మామిడి పండ్లపై ఉన్న రసాయన ప్రభావం తగ్గుతుంది.

3 /5

How to Eat Mangoes: మామిడి పండ్లను నీళ్లలో పెట్టకుండా తినడం వల్ల ముఖంపై మొటిమలు, కురుపులు రావచ్చు. నీళ్లో పెట్టి తీసిన పండ్లు తింటే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

4 /5

How to Eat Mangoes: సహజంగానే మామిడి పండ్లకు వేడిని పెంచే గుణం ఉంటుంది. అందుకే నేరుగా మామిడి పండ్లను తింటే వేడితో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నీళ్లలో కొద్దిసేపు పెట్టి తీసిన మామిడి పండ్లు తింటే అలాంటి ఇబ్బందులు ఉంే అవకాశం లేదు

5 /5

How to Eat Mangoes: మామిడి పండ్లలో ఫైటోకెమికల్ అనే రసాయనం ఉంటుంది. ఇది మనిషి బరువును పెంచుతుంది. ఒకవేళ మామిడి పండ్లను నీళ్లలో కొంతసేపు పెట్టి తీసిన తరువాత తిన్నట్టయితే.. ఫైటోకెమికల్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే బరువు పెరిగే అవకాశం ఉండదన్నమాట.