Pragya Jaiswal: రంగురంగుల డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్.. కుర్రకారుల హృదయాలు ఫిదా

Pragya Jaiswal Instagram Pics: కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ప్రేమలో పడేస్తున్నాయి.
 

1 /5

ఎలాంటి పాత్రకి అయినా సెట్ అయ్యే హీరోయిన్స్ కొద్దిమందే ఉంటారు. వారిలో ఒకరు ప్రగ్యా జైస్వాల్. ఈ హీరోయిన్ ట్రెడిషనల్ గా ఎంతగా ఆకట్టుకుందో మోదరన్ డ్రెస్సుల్లో కూడా ప్రేక్షకులను అంతగానే ఆకట్టుకుంటూ ఉంటుంది.

2 /5

వరుణ్ తేజ్ హీరోగా చేసిన క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచా సినిమా ద్వారా ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాలో ఎంతో అందంగా, హుందాగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.  

3 /5

ఆ తరువాత వచ్చిన నమో వెంకటేశా సినిమాలో చిలిపిగా కనిపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమాలో మోదరంగా కనిపించి అహో అనిపించుకుంది.  

4 /5

కానీ ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో విజయాలు మాత్రం రాలేదు. ఇక బాలకృష్ణతో చేసిన అఖంద సినిమా మాత్రం కంచె తరువాత మళ్లీ ప్రగ్యాకి మంచి సక్సెస్ అందించింది.

5 /5

ప్రస్తుతం హిందీ సినిమాలలో సైతం బిజీగా ఉన్న ప్రగ్యా  ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. రంగురంగుల డ్రెస్సులో ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.