Urvashi Rautela: రెడ్ కలర్ డ్రెస్‌లో మరింత హాట్‌గా ఊర్వశి రౌతెలా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Urvashi Rautela: ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది కొంత మంది విషయంలో కరెక్ట్ అనిపిస్తోంది. అందులో ఊర్వశి రౌతెలా ముందు వరసలో ఉంటుంది. ఈమె తన అందంతో ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. బాలయ్యతో చేస్తోన్న సినిమాపై ఈమె మంచి ఆశలే పెట్టుకుంది.

1 /5

ఊర్వశి నటన కన్నా..తన అందచందాలతో మంచి పేరు తెచ్చుకుంది. అచ్చు దేవ లోకానికి సంబందించిన ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన డాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టింది.

2 /5

ఊర్వశి రౌతెలా బాలీవుడ్‌లో సన్ని దేవోల్ హీరోగా నటించిన 'సింగ్ సాబ్‌ ది గ్రేట్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ప్రస్తుతం తెలుగులో ఐటెం సాంగ్స్‌తో ఇక్కడ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది.

3 /5

ఊర్వశి రౌతెలా.. 15 ఏళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.  2009లో మిస్ ఇండియా టీన్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2013లో సన్నిదేవోల్ 'సింగ్ సాబ్ ది గ్రేట్' మూవీతో తెరంగేట్రం చేసింది.

4 /5

ఊర్వశి రౌతెలా..ముఖ్యంగా హిందీలో 'సనమ్ రే, ' ది గ్రేట్ గ్రాండ్ మస్తీ', హేట్ స్టోరీ 4, పాగల్ పంతి సినిమాలతో ఫేమ్ అందుకుంది. 2014లో 'మిస్టర్ ఐరావత' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

5 /5

ఊర్వశి రౌతెలా 1994 ఫిబ్రవరి 25న హరిద్వార్‌లో జన్మించింది. తల్లి మీరా రౌతెలా, తండ్రి మన్వర్ సింగ్ రౌతెలా ఈమెది గర్వాలీ రాజ్‌పుత్ ఫ్యామిలీ.