Man Died of Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో రైల్వే గేటు వద్ద చిక్కుకుపోయిన అంబులెన్స్ !!

Man Died of Heart Attack Due to Ambulance stuck at Railway Gate: గుండె నొప్పితో బాధపడుతున్న పేషెంట్ ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకుంటుంది అనగా మార్గం మధ్యలో రైల్వే గేటు పడింది. దీంతో హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్ అక్కడే చిక్కుకుపోయింది. చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నప్పటికీ.. రైల్వే గేట్ పడటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. పూర్తి వివరాలు...

Written by - Pavan | Last Updated : Jul 10, 2023, 12:30 PM IST
Man Died of Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో రైల్వే గేటు వద్ద చిక్కుకుపోయిన అంబులెన్స్ !!

Man Died of Heart Attack Due to Ambulance stuck at Railway Gate:  ధర్మారం: గురుకులం విద్యాలయంలో పదో తరగతి చదువుతోన్న తన కూతురును చూసేందుకు వచ్చిన ఒక తండ్రి.. కూతురితో ఉండగానే గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన శనివారం జగిత్యాస జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో చోటుచేసుకుంది. రెండో శనివారం కావడంతో గురుకులం విద్యాలయంలో పేరెంట్స్ డే నిర్వహించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి విజయ్, సుధీవన దంపతుల కూతురు స్పందన ఇదే గురుకులం విద్యాలయంలో పదో తరగతి చదువుకుంటోంది. దీంతో పేరెంట్స్ డే కి హాజరై అలాగే తన కూతురిని కూడా చూసి వెళ్లినట్టు ఉంటుందని భావించిన భూపెళ్లి విజయ్.. తన భార్య సుధీవనతో కలిసి శనివారం విద్యాలయానికి వచ్చాడు. 
 
ఇంటి నుంచి తన కుమార్తె కోసం తీసుకెళ్లిన ప్రత్యేకమైన వంటకాలు కూతురుకు తినిపించి మురిసిపోయారు. విజయ్, సుదీవన ఇద్దరూ తమ కూతురు స్పందనతో కలిసి సరదాగా సమయం గడపసాగారు. కానీ అంతలోనే విధి వక్రీకరించింది.. బహుషా కూతురితో కలిసి సరదాగా గడుపుతున్న ఆ తండ్రిని చూసి విధి కూడా ఓర్వలేకపోయినట్టుంది.. ఉన్నట్టుండి ఆ తండ్రి గుండెపోటుతో అల్లాడిపోయాడు. భరించలేని గుండె నొప్పితో కిందపడి కొట్టుకుంటున్న భూపేష్ ని వెంటనే గురుకులం విద్యాలయం సిబ్బంది కరీంనగర్ తరలించే ప్రయత్నం చేశారు. 

కరీంనగర్‌కి వెళ్లే క్రమంలోనే మార్గం మధ్యలోనే అతడికి మరోసారి గుండెపోటు వచ్చింది. విధి ఈసారి అతడిని మరింత చిన్నచూపు చూసింది. అప్పుడే కరీంనగర్ సమీపంలోనే మార్గం మధ్యలో ఉన్న రైల్వే గేట్ పడింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సుమారు 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే భూపేష్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 

అసలేమైందంటే..
విజయ్, సుదీవన ఇద్దరూ మధ్యాహ్నం విద్యాలయంలో కూతురుతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో వర్షం రావడంతో ప్రిన్సిపాల్ గిరిజ తల్లిదండ్రులు అందరినీ హాల్లోకి రావాల్సిందిగా సూచించారు. హాల్‌లోకి వచ్చిన విజయ్.. అక్కడ కూర్చుంటున్న క్రమంలోనే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం, విజయ్ భార్య సుధీవన చికిత్స కోసం అతడిని అంబులెన్సులో కరీంనగర్‌కు తరలించారు. 

ఇది కూడా చదవండి : Anaconda Snake Chasing Boy : బాలుడి వెంటపడిన భారీ సైజ్ ఆనకొండ పాము.. ఈ వైరల్ వీడియో నిజమేనా ?

భార్య, కూతురి కళ్ల ముందే..

కరీంనగర్ వద్ద ఉన్న రైల్వేగేట్ అప్పుడే పడటంతో అక్కడే 15 నిమిషాలపాటు అంబులెన్స్ ఆగిపోవాల్సి వచ్చింది. విజయ్ అంబులెన్స్‌లోనే అవస్థ పడుతుండటం చూసి వెంటనే అతడికి సీపీఆర్ (CPR) పద్ధతిలో గుండె కొట్టుకునేలా చేసే ప్రయత్నం చేశారు. రైలు వెళ్లిపోయిన అనంతరం అతడిని తీసుకెళ్లి తీరా ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్ వద్ద రైల్వే గేట్ పడకుంటే విజయ్ బతికేవాడని మల్లేశం తెలిపారు. మృతదేహం వద్ద కూతురు స్పందన రోదించిన తీరు కలచివేసింది. తనని చూసేందుకు రాకపోయి ఉంటే బతికే వాడివి నాన్న అంటూ కూతురు స్పందన రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యులు, రోదనలతో స్తంభంపల్లిలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి : Landslides Falling on Roads : కార్లు వెళ్తున్న రోడ్డుపై కుప్పకూలిన కొండచరియలు.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News