School teacher dance: బూతు పాటపై స్కూల్ పిల్లలతో టీచర్ డాన్స్

School teacher dance Video: స్కూల్ పిల్లలతో కలిసి వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలంటే అందుకు దేశభక్తి గీతమో లేక పిల్లలకు ఉపయోగపడే పాటనో ఎంచుకోవాలి. కానీ ఈ టీచరమ్మ అలా చేయకుండా తన రీల్ వీడియో కోసం ఓ బోజ్‌పురి రొమాంటిక్ సాంగ్‌ని ఎందుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2022, 11:56 AM IST
  • క్లాస్‌రూమ్‌లో చిన్నారులతో కలిసి స్కూల్ టీచర్ డాన్స్
  • స్కూల్ టీచర్ ఎంచుకున్న సాంగ్‌పై భగ్గుమంటున్న నెటిజెన్స్
  • సోషల్ మీడియాలై వైరల్ అవుతున్న స్కూల్ టీచక్ డాన్స్ వీడియో
School teacher dance: బూతు పాటపై స్కూల్ పిల్లలతో టీచర్ డాన్స్

School teacher dance Video: సోషల్ మీడియాలో తమ పోస్టులకు లైక్స్, షేర్స్, కామెంట్స్ ఎక్కువ తెచ్చుకోవాలనే పిచ్చి కోరికతో కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. కొంతమంది సాహసోపేతమైన స్టంట్స్ చేసి ఇబ్బందులపాలవుతుంటే.. ఇంకొంతమంది ఏవేవో వెకిలి వేషాలు వేసి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. అలా ఓ స్కూల్ టీచరమ్మ కూడా బోజ్‌పురి పాటపై స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి వారి ఎదుటే స్టెప్పేయడమే కాకుండా అందులో వారిని కూడా ఇన్వాల్వ్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజెన్స్ మండిపడుతున్నారు.

స్కూల్ పిల్లలతో కలిసి వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలంటే అందుకు దేశభక్తి గీతమో లేక పిల్లలకు ఉపయోగపడే పాటనో ఎంచుకోవాలి. అలా చేస్తే పిల్లల్లో దేశభక్తి భావన పెరుగుతుంది లేదా సమాజంలో బాధ్యతగా నడుచుకోవాలనే విషయం తెలిసొస్తుంది. కానీ ఈ టీచరమ్మ అలా చేయకుండా తన రీల్ వీడియో కోసం ఓ బోజ్‌పురి రొమాంటిక్ సాంగ్‌ని ఎందుకుంది. పత్లి కమరియా మోరి అంటూ సాగే ఈ బోజ్‌పురి పాటలో హీరోయిన్ నడుం అందాల గురించి వర్ణించాడు ఆ లిరిక్ రైటర్. ఆ పాటకు టీచరమ్మ ఫిదా అయిందేమో కాబోలు ఇలా బాధ్యత మరిచి స్కూల్ పిల్లల ముందు చిందేసింది. తన చిందులకు చిన్నారులతో కూడా హాయ్ హాయ్ అంటూ కోరస్ స్టెప్పు వేయించింది.

 

స్కూల్ టీచర్ వీడియో చూసిన నెటిజెన్స్ ఆమె వైఖరిపై మండిపడుతున్నారు. ఇలాంటి టీచర్‌ని వెంటనే ఉద్యోగంలోంచి పీకిపారేయాలని కొందరు కామెంట్ చేస్తే.. త్వరలోనే ఆమె ఉద్యోగం ఊడిపోతుంది.. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ మరొక ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు. 

 

ఎవరో కొంతమంది నెటిజెన్స్ ఈ వీడియో చూసి చిలిపి కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. గుడిలాంటి బడిలో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సింది పోయి పిల్లల ముందు బూతు పాటలపై ఈ చిందులేంటి అని మండిపడుతున్న నెటిజెన్స్ సంఖ్యే ఎక్కువగా ఉంది. 

 

ఇంకొక యూజర్ ఈ వైరల్ వీడియోపై ( Viral Video ) స్పందిస్తూ.. బడిలో పిల్లలకు టీచర్స్ నేర్పిస్తోంది ఇదన్న మాట అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు.

Also Read : Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. తొక్కుడే తొక్కుడు.. వీడియో వైరల్

Also Read : Electric Cycle Video: 6 సీట్ల ఎలక్ట్రిక్ సైకిల్.. తొక్కాల్సిన పనే లేదు.. వైరల్ వీడియో

Also Read : Viral Video: ఏ కరువులో ఉన్నార్రా నాయనా.. ఆహారం కోసం గేటు బద్ధలు కొట్టడం ఏంటి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News