Alphonso Mangoes: చలికాలంలో మామిడి పండ్ల మజా కావాలా ? ఇది చదవండి!

Alphonso In Winter | చలికాలంలో కూడా మీరు ఆల్పాంజో మామిడి పండ్లు తినాలి అనుకుంటున్నారా ?  ఇది ఎలా సాధ్యం..అది కూడా నవంబర్, డిసెంబర్ లో అని ఆలోచిస్తున్నారా...ఎలా సాధ్యమో మీకు చెబుతాం.

Last Updated : Nov 13, 2020, 11:59 PM IST
    1. చలికాలంలో కూడా మీరు ఆల్పాంజో మామిడి పండ్లు తినాలి అనుకుంటున్నారా ? ఇది ఎలా సాధ్యం..అది కూడా నవంబర్, డిసెంబర్ లో అని ఆలోచిస్తున్నారా.
    2. ఎలా సాధ్యమో మీకు చెబుతాం. అయితే దీని కోసం మీరు కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి.
Alphonso Mangoes: చలికాలంలో మామిడి పండ్ల మజా కావాలా ? ఇది చదవండి!

Alphonso In Winter | చలికాలంలో కూడా మీరు ఆల్పాంజో మామిడి పండ్లు తినాలి అనుకుంటున్నారా ? ఇది ఎలా సాధ్యం..అది కూడా నవంబర్, డిసెంబర్ లో అని ఆలోచిస్తున్నారా ? ఎలా సాధ్యమో మీకు చెబుతాం. దీని కోసం మీరు కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధం అయితే వెంటనే మీరు నాన్ సీజన్ లో కూడా మామాడి పండ్లను ఎంజాయ్ చేయవచ్చు. అయితే దీని కోసం మీరు ముంబైకి కూడా వెళ్లాల్సి ఉంటుంది.

Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం

ముంబైలోని ఏపిఎంసి మార్కెట్ లో ఆల్పాంజో మామిడి పండ్ల కార్టన్లు చేరుకున్నాయి. ప్రతీ కార్టన్ రూ.1400కు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇవి ఆఫ్రికా నుంచి భారతదేశానికి దిగువతి అవుతాయి. ఆల్పాంజో మామిడి పండ్లను మీరు డిసెంబర్లో తినాలంటే మీకు మహారాష్ట్రలో ( Maharastra)  అనేక ప్రాంతాల్లో మీకు సులభంగా లభిస్తుంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ పండ్లను భారత దేశంలో వివిధ ప్రాంతాలకు మహారాష్ట్ర నుంచి రవాణా చేస్తుంటారు.

Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్

ఆల్పాంజో ప్రత్యేకతలు

ఆల్పాంజో మామిడి పండ్లు తినడానికి మంచి రుచితో పాటు అద్భుతమైన సువాసనను కలిగి ఉంటాయి. మాల్వీలో సుమారు 1500 ఎకరాల్లో ఆల్పాంజో తోటలు వేశారు. అక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులు ఆ వాసనకు మైమరిపోతుంటారు. అక్కడి నుంచి ఈ మధ్యకాలంలో ముంబైకి ( Mumbai)  ఈ పండ్లు చేరుతున్నాయి. అక్కడి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆల్పాంజో ప్రియుల వద్దకు అవి చేరుతాయి.

Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది

అంటే ముంబై మార్కెట్లో ఇప్పుడు మీకు నచ్చిన మామిడి రకం విరివిగా అందుబాటులో ఉంది అని అర్థం. క్వాలిటీని బట్టి రూ.700 నుంచి రూ.900 వరకు వీటిని కొనుగోలు చేయవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News