కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? అయితే దానికి అర్థం ఇదే!

చనిపోయిన వ్యక్తులు కలలలో పదేపదే కనిపించడం కొన్ని సందర్భాల్లో శుభ ప్రదం అయితే.. మరి కొన్ని సందర్భాల్లో అశుభంగా భావించాలి. ఇక్కడ తెలిపిన వాటిని అనుసరించటం ద్వారా వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 02:40 PM IST
  • చనిపోయిన బంధువులు కలలో కనిపిస్తున్నారా?
  • ఇలా తరచుగా కలలు రావటం ఆందోళన కలిగిస్తుంది
  • స్వపాన శాస్త్రంలో వీటి గురించి తెలుపబడింది
కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? అయితే దానికి అర్థం ఇదే!

Dream Astrology: మీరు పడుకున్నప్పుడు పదే పదే చనిపోయిన వారు కలలో కనపడుతున్నారా..?? ఇలా కనపడితే మరణించిన వారు ఆత్మ రూపంలో మన చుట్టు తిరుగుతున్నారనే భయం మనలో కలగటం సాధారణం. దాదాపు మనకు సన్నిహితంగా ఉన్నవారు, ఇష్టమైన వ్యక్తులు మాత్రమే మరణానంతరం కలలో కనపడతారు. అయినప్పటికీ అలా కనిపించటం మనలో ఆందోళనలు కలిగిస్తుంది. 

నిజానికి స్వపాన శాస్త్రంలో (Swapana Shastra) ఇలాంటి వాటి గురించి చర్చినబడింది. ఈ శాత్రంలో కలలో ఇలాంటి వచ్చే సంఘటనల వలన కలిగే శుభ మరియు అశుభ సంకేతాల గురించి పూర్తిగా వివరించబడింది. ఇలాంటి భయానక పరిస్థితుల నుండి  బయటపడటానికి ఏం చేయాలో ఇపుడు తెలుసుకుందాం!

Also Read: సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి

ఎందుకు మరణించని వ్యక్తి కల్లో కనిపిస్తాడు..??

1) స్వపాన శాస్త్రంలో తెలిపిన దాని ప్రకారం.. మన కుటుంబంలో మరణించిన వారు కలలో పదే పదే కనపడుతున్నారంటే దానికి అర్థం వారు మరణించినా.. వారి ఆత్మ మనతోనే సంచరిస్తుందని అర్థం. ఆచారబద్దంగా కొన్నిటిని పాటించటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. కలలో కనిపించే పేరు మీద రామాయాణం లేదా భావద్గీత పఠించటం ప్రారంభించండి. 

2) ఒకవేళ చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే.. ఆ వ్యక్తి మీ నుండి ఎదో ఆశిస్తున్నాడని అర్థం. కావున కలలో చెప్పిన విధంగా ఆ పనిని పూర్తీ చేయండి. ఒకవేళ.. ఏదైనా తీరని కోరిక మీతో పంచుకుంటే.. అది పూర్తీ చేయటానికి ప్రయత్నించండి. పిల్లలకు స్వీట్లు పంచటం, పేదలకు సహాయం చేయటం వంటివి చేయండి. తర్పణం చేయకపోతే ఇపుడు చేయటం మరవకండి. 

3) చనిపోయిన వ్యక్తి మీ కలలో కనపడి ఏదైనా పని చేయమని అడిగితే, వారు చెప్పిన పని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అలాగే, అతని పేరు మీద దానధర్మాలు చేయండి.

Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం

4) ఒకవేళ చనిపోయిన మీ కుటుంబ సభ్యుడే మీ కలలో కనపడితే.. అది చాలా శుభప్రదమని మరవకండి 

5) చనిపోయిన వ్యక్తి కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే, అతను సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నాడని అర్థం. అలాంటి కలలు మీరు సాధించబోయే విజయాలకు సూచిక అని మరవకండి 

6) ఒకవేళ చనిపోయిన బంధువులు లేదా సన్నిహితులు మీ కలలో పదే పదే కనిపిస్తూ...  నిశ్శబ్దంగా, మీతో మాట్లాడకుండా ఉన్నారంటే.. మీరు ఎదో తప్పు పని చేస్తున్నారని అర్థం.. వెంటనే అలాంటి పనులు చేయకుండా దూరంగా ఉండండి 

7) చనిపోయిన బంధువులు ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే, వెంటనే పేదలకు ఆహారం, బట్టలు, బూట్లు మరియు చెప్పులు దానం చేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News