Happy Pongal 2023: ఈ వ్యక్తుల అదృష్టం సంక్రాంతి నాడు సూర్యునిలా ప్రకాశిస్తుంది.. ఇందులో మీరున్నారా?

Makar Sankranti 2023: సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఇది కొందరికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 05:08 PM IST
Happy Pongal 2023: ఈ వ్యక్తుల అదృష్టం సంక్రాంతి నాడు సూర్యునిలా ప్రకాశిస్తుంది.. ఇందులో మీరున్నారా?

Makar Sankranti Lucky Zodiac Signs: హిందువుల ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగను మన తెలుగు లోగిళ్ల చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈరోజున పుణ్య నదులలో స్నానం చేయడం, దానాలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇదే సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యభగవానుడి సంచారం వల్ల కొందరికి అదృష్టం కలుగనుంది.ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మకరం (Capricorn): సూర్యుని సంచారం మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ కెరీర్ కు కొత్త తలుపులు తెరుచుకుంటాయి. మీరు పాత రోగం నుండి బయటపడతారు. 
మేషం (Aries): మేషరాశి వారికి మకర సంక్రాంతి శుభవార్త తెస్తుంది. ఈ రోజున మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. సూర్యభగవానుని అనుగ్రహంతో ప్రతి పని పూర్తి అవుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.
సింహం (Leo): మకర సంక్రాంతి నాడు సింహ రాశి వారికి సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆఫీసులో మీ యెుక్క ప్రాబల్యం పెరుగుతుంది. శత్రువులను జయిస్తారు. దిగుమతి-ఎగుమతులతో సంబంధం ఉన్న వ్యక్తులు అధిక లాభాలను గడిస్తారు. 

వృశ్చికం (Scorpio): మకర సంక్రాంతి నాడు వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు శుభవార్తలు వింటారు. మీలో ధైర్యసాహసాలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
కన్యా రాశి (Virgo): సూర్యుని అనుగ్రహంతో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. తండ్రి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకులు త్వరలో విజయం సాధిస్తారు.

Also read: Happy Pongal 2023: సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే అంతే సంగంతి.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News