Guru Gochar 2024: మే 01 నుంచి ఈ 4 రాశులకు దారిద్ర్యం పోయి.. ధన వర్షం కురవబోతుంది...

Guru Gochar in May 2024: వచ్చే నెలలో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఇందులో బృహస్పతి రాశి మార్పు ఒకటి. దేవగురు మే నెలలో వృషభరాశిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 19, 2024, 09:20 PM IST
Guru Gochar 2024: మే 01 నుంచి ఈ 4 రాశులకు దారిద్ర్యం పోయి.. ధన వర్షం కురవబోతుంది...

Jupiter Transit in taurus 2024: శుభప్రదమైన గ్రహాల్లో బృహస్పతి ఒకటి. ఇతడు ఏడాదికొకసారి తన రాశిని మారుస్తాడు. వచ్చే నెల 01న గురుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. బృహస్పతి యెుక్క రాశి మార్పు మెుత్తం 12 రాశిచక్రాలపై కనిపిస్తుంది. గురుడు వృషభరాశి ప్రవేశం వల్ల నాలుగు రాశులవారు ఎనలేని కీర్తి ప్రతిష్టలు గడించనున్నారు. ఆ అదృష్ట రాశులు వారు ఎవరో తెలుసుకుందాం. 

వృషభం: 
బృహస్పతి ఇదే రాశిలోకి వెళ్లబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి అదృష్టం పట్టబోతుంది. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీకు రకరకాల మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. మీరు చేసిన పనికి మీ బాస్ నుంచి అభినందనలు వస్తాయి. 
మేషం: 
ఇదే రాశిని విడిచిపెట్టి గురుడు వృషభరాశిలోకి వెళ్లబోతున్నాడు. దీంతో మేషరాశి వారు ఎప్పుడూ చూడని లాభాలను చూస్తారు. ఈ నెలంతా వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీతాలు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ఎన్నో రెట్లు లాభాలను ఇస్తాయి. 
కర్కాటక రాశి: 
గురు గ్రహ సంచారం కర్కాటక రాశి వ్యక్తులకు మునుపెన్నడూ ఇవ్వని లాభాలను ఇస్తాయి. ఈ టైంలో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయే సమయం వచ్చింది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ఖర్చులతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు.

Also Read: Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

సింహం: 
జ్యూపిటర్ సంచారం సింహరాశి వారికి అప్పుల నుండి విముక్తి చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. మీకు పూర్వీకులు స్థిర చరాస్థులు కలిసి వస్తాయి. ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీ కెరీర్ అనుకొని మలుపు తిరుగుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. 

Also Read: Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News