Guru Margi 2022: నవంబర్ 24న మీనరాశిలో గురుడు కదలిక.... ఈ రాశులకి తిరుగుండదు ఇక..

Jupiter Retrograde 2022: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం గురుడు తన సొంత రాశి అయిన మీనరాశిలో తిరోగమనం చెందాడు. నవంబరు 24న మార్గంలోకి రానున్నాడు. దీంతో ఈ రాశులవారికి ప్రయోజనం కలుగనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 03:14 PM IST
Guru Margi 2022: నవంబర్ 24న మీనరాశిలో గురుడు కదలిక....  ఈ రాశులకి తిరుగుండదు ఇక..

Guru Margi 2022 effect: జ్యోతిషశాస్త్రంలో మొత్తం 9 గ్రహాలు, 12 రాశుల మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి.  దేవగురువు బృహస్పతికి జ్యోతిష్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇతడిని శుభగ్రహంగా భావిస్తారు. గౌరవం, వివాహం, అదృష్టం, ఆధ్యాత్మికత, పిల్లలకు కారకుడిగా గురు గ్రహాన్ని పరిగణిస్తారు. జూలై 29, శుక్రవారం నాడు మీనరాశిలో గురుడు తిరోగమనం చేశాడు. నవంబరు 24 వరకు బృహస్పతి అదే స్థితిలో ఉంటాడు. గురుడు తిరోగమనం కొందరి జీవితాల్లో పెను మార్పులు తీసుకురానుంది. గురుడు మార్గంలో రావడానికి 119 రోజులు పడుతుంది అంటే నవంబర్ 24 సాయంత్రం 4:29 గంటలకు సంచారంలోకి రానున్నాడు. 

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి అత్యంత ప్రయోజనకరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. గురు గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి సుమారు సంవత్సరం పడుతుంది. బృహస్పతి తన రాశిలో ఉన్నప్పుడు, అది స్థానికులకు శుభ ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి సంచారంలోకి (Guru Margi in Pisces 2022) వచ్చిన తరువాత వృషభం, కర్కాటకం, కన్యారాశితో పాటు వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి వృత్తిపరమైన పురోగతితో పాటు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా పొందుతారు. జాతకంలో బృహస్పతి బలంగా ఉన్న వ్యక్తులు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. గురు సంచారం వల్ల జీవితంలో ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థానం లభిస్తాయి.

Also Read: Shani Dev: ఈ 5 రాశుల వారిపై శనిదేవుని అనుగ్రహం... జనవరి 17 వరకు వీరికి డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News