Mars Transit 2024: మార్చి నెలలో ఈ రాశులవారిపై ధన వర్షం..సంపాదనలో ఊహించని మార్పులు!

Mars Transit 2024: అంగారక గ్రహం మార్చి 15వ తేదిన శని కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది.. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడి..కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 10:41 AM IST
Mars Transit 2024: మార్చి నెలలో ఈ రాశులవారిపై ధన వర్షం..సంపాదనలో ఊహించని మార్పులు!

Mars Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని  ధైర్యం, విశ్వాసానికి ప్రతికగా సూచిస్తారు. ఇలాంటి గ్రహం రాశి సంచారం చేసిప్పుడు మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. మార్చి 15న కుజుడు శని రాశి అయిన కుంభంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కుజుడు జాతాకాల్లో ప్రత్యేకమైన స్థానాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వృత్తి జీవితంలో పాటు వ్యాపారల్లో అనేక లాభాలు పొందుతారు. అయితే ఈ సమయం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
కుజుడి సంచారం మేష రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోందని సమాచారం. ఈ రాశివారికి రాజకీయ రంగంలో ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సులభంగా విజయాలు సాధించగలుతారు. అలాగే వివాహితులకు ఈ సంచారం కారణంగా వైవాహిక జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా త్వరలోనే శుభవార్తలు కూడా వింటారు. 

కుంభరాశి:
అంగారుకుడి సంచారం కారణంగా కుంభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల కలిసి వస్తుంది. దీంతో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల లాభాలు పొందుతారు. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో ఆకస్మిక మార్పులు పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. 

తుల రాశి:
ఈ సంచారం కారణంగా తుల రాశివారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా వివాహితులకు కూడా ఈ సమయం చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

కర్కాటక రాశి:
ఈ అంగారక సంచారం కారణంగా కర్కాటక రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి కుజుడి అనుగ్రహం లభించి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఈ రాశివారు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మకర రాశి:
మకర రాశి వారికి కూడా అంగారక గ్రహ సంచార ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా  వీరికి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన మార్పులు కూడా వస్తాయి. అలాగే రాజకీయ రంగాల్లో పనులు చేసేవారికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు సంపాద కూడా పెరుగుతుంది. 

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News